వైభవంగా మరియ మాత ఉత్సవాలు
కై కలూరు: మరియ మాత మహోత్సవాలు కలిదిండి విచారణ చర్చి వద్ద ఆదివారం రెండో రోజు ఘనంగా కొనసాగాయి. సమీప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేశారు. కలిదిండి విచారణ కర్త బంటుమిల్లి యోహాను సమష్టి దివ్య పూజా బలి నిర్వహించారు. సాయంత్రం మేత్రాసన ఇంగ్లీషు మీడియం స్కూల్స్ కో–ఆర్డినేటర్ పల్లె విజయ జోజిబాబు ఏసు సందేశాన్ని అందించారు. కోరుకొల్లు విచారణకర్త గూడపాటి ప్రతాప్ ఆధ్వర్యంలో భక్తి పాటలు ఆలపించారు. అనంతరం కొవ్వూరుకు చెందిన హార్ట్ బీట్స్, క్రిస్టియన్ అర్కెస్ట్రా ఆలపించిన మధుర గీతాలు ఆకట్టుకున్నాయి. భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment