యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
పట్టించుకోని అధికారులు
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం చీమలవారిగూడెం సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పట్టపగలు ఎలాంటి అనుమతి లేకుండా చింతలపూడి గట్టును ఆనుకుని ఉన్న ఆర్ అండ్ ఆర్ భూమిలో మట్టిని జేసీబీతో తవ్వి టిప్పర్లలో తోలుకుపోతున్నారు. కనీసం అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వెంచర్లు, లేఅవుట్, రియల్ ఎస్టేట్‌లకు అక్రమంగా మట్టిని తోలుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 5 రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సహకారంతోనే యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమంగా తరలుతున్న మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
Comments
Please login to add a commentAdd a comment