ఆటో బోల్తా పడి యువకుడి మృతి
ఆగిరిపల్లి: మండలంలోని అమ్మవారిగూడెం వద్ద ఆటో బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. ఆగిరిపల్లి చెందిన కూరపాటి నాని (31)ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఆగిరిపల్లి నుంచి బండారు గూడెంకు ఆటోలో గోనె సంచుల లోడుతో వెళ్తుండగా అమ్మవారిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే గోతిలో బోల్తా పడింది. ప్రమాదంలో నాని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బధిర టీ 20 క్రికెట్ పోటీలకు ఎంపిక
భీమవరం(ప్రకాశంచౌక్): 7వ జాతీయస్థాయి బధిర టీ–20 క్రికెట్ పోటీలకు 16 మంది ఎంపికయ్యారని జిల్లా బధిర క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు రంగసాయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్ తాతారావు తెలిపారు. జాతీయస్థాయికి ఎంపికై న 16 మంది క్రీడాకారులు ఏప్రిల్ 19 నుంచి 25 వరకు హరియాణాలో జరిగే టీ–20 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆదివారం భీమవరం వెంకట్రామ థియేటర్‌లో జరిగిన సమావేశంలో వివరాలను తెలిపి ఎంపికై న వారికి అభినందనలు తెలిపారు. ఇటీవల భీమవరం డీఎన్నార్ క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి టీ–20 క్రికెట్ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల్లో 16 మంది జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని కోరుకుంటున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment