కూటమి మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

కూటమి మట్టి మాఫియా

Published Mon, Mar 3 2025 12:42 AM | Last Updated on Mon, Mar 3 2025 12:40 AM

కూటమి

కూటమి మట్టి మాఫియా

మైనింగ్‌ నిబంధనలు

● మైనింగ్‌ కోసం ఆన్‌లైన్‌లో రూ.6 వేలు చలానా కట్టి దరఖాస్తు చేసుకోవాలి.

● మైనింగ్‌ శాఖ నుంచి స్థానిక రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తు ప్రకా రం సర్వే నంబర్లలో పరిశీలించి తహసీల్దార్‌ నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.

● తిరిగి మైనింగ్‌ జియాలజిస్ట్‌, తహసీల్దార్‌, సర్వేయర్‌ పరిశీలించి చెక్‌ రిపోర్టును మైనింగ్‌ శాఖ ఏడీకి పంపాలి.

● లైసెన్సుదారుడు సీనరేజ్‌, డీఎఫ్‌ఎం కింద క్యూబిక్‌ మీటరకు రూ.114 చెల్లించాలి.

● గవర్నమెంట్‌ ప్రెస్‌కు పంపించి స్టేషనరీ కింద బిల్‌ బుక్స్‌ అందిస్తారు. మట్టి తరలించే వాహన డ్రైవర్ల వద్ద ఇవి ఉండాలి.

● నేషనల్‌ హైవే పనులకు మట్టిని తరలించే కాంట్రాక్టర్‌ సీనరేజీ కట్టాలి. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ కింద వీటిని తిరిగి చెల్లిస్తుంది. ఇవేమీ కై కలూరు నియోజకవర్గంలో అమలు కావడం లేదు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : ‘నా నియోజకవర్గం నుంచి ఒక్క టిప్పరు ఇసుక బయటకు వెళ్లినా ఊరుకోను.. రోడ్లు పాడవుతున్నాయి.. నిబంధనలకు లోబడి మాత్రమే ఇక్కడ జరుగుతున్న హైవే రోడ్డు పనులకు మట్టిని తరలించాలి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దందాకు పూర్తిగా స్వస్తి పలకాలి’ ఇది కై కలూ రు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ ఇటీవల మీడియా సాక్షిగా పోలీసు, రెవెన్యూ అధికారులకు తీసుకున్న క్లాస్‌. ఇదంతా ఒకవైపే.. అయితే పరిస్థితి భిన్నంగా ఉంది. నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు కూటమి నేత లే అక్రమ మైనింగ్‌ పనులపై కన్నెర్ర చేస్తున్నారు.

పోలీసుల ఎదుటే ఆందోళన

టీడీపీ నాయకుడు వీరాబత్తిన సుధా కై కలూరు సీఐ కార్యాలయం ఎదుట రోడ్డుపై వెళుతున్న అక్రమ మట్టి టిప్పరును నిలుపుదల చేసి సీజ్‌ చేయాలని శనివారం పోలీసుల ఎదుటే ఆందోళన చేశారు. కూటమి పార్టీ సానుభూతిపరుడు స్థానిక పంచాయతీలో కీలక వార్డు సభ్యుడు కేవీఎన్‌ఎం నాయుడు భారీ ఇసుక టిప్పర్ల కారణంగా రోడ్లు పాడవుతు న్నాయని ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు తెలిసీ ఈ తంతు జరిగితే తాము కూడా మట్టి వ్యాపారం చేస్తామని ఘాటుగా విమర్శించారు. ఈ రెండు ఘటనలు చాలు నియోజకవర్గంలో మట్టి మాఫియా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోడానికి అని కొందరు కూటమి నేతలే వాపోతున్నారు.

హైవే పనుల పేరుతో మోసం

కై కలూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి బైపాస్‌ పనులు కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. హైవే పనుల పేరు చెప్పి మట్టి టిప్పర్లను గుడివాడ, భీమవరం, ఏలూరు వంటి పట్టణాలకు తరలించేస్తున్నా రు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిని తిట్టడానికి మా త్రమే ఉపయోగించే దుందుడుకు గడ్డం నాయకుడిగా పేరుపొందిన వ్యక్తి సహజ వనరులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నాడు.

● మండవల్లి మండలం భైరవపట్నంకు చెందిన ఓ నాయకుడు చేసే అక్రమ మైనింగ్‌పై కన్నెత్తి చూసే సాహసం అధికారులు చేయలేరు. సమీప ఎమ్మెల్యే తమ వాడే అంటూ బాబాయి, అబ్బాయిలు తమకు మైనింగ్‌లో తిరుగేలేదంటూ చెలరేగిపోతున్నారు.

● ఎన్నికల్లో ఖర్చుపెట్టి నష్టపోయానూ అంటూ కలిదిండి మండలంలో ‘లంక’ గ్రామాలను ఓ నేత దోచేస్తున్నాడు.

● ముదినేపల్లి మండలం వణుదుర్రులో ప్రభు త్వం తమదే మట్టి అమ్ముకుంటా ఎవరడుగుతా రూ అంటూ ఓ వ్యక్తి సవాల్‌ విసురుతున్నాడు.

● కొల్లేరు నాయకుడిగా చలామణి అవుతున్న నేత ఓ పక్క సుప్రీంకోర్టు కొల్లేరు అభయారణ్యంపై హెచ్చరికలు చేస్తున్నా.. కొల్లేరు గ్రామాల్లో దగ్గరుండి తన సామాజికవర్గంతో మట్టిని విక్రయిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలానే ఉంది.

తవ్వేయ్‌.. తరలించేయ్‌

కై కలూరులో అక్రమ తవ్వకాలు

హైవే పనుల పేరుతో దోపిడీ

రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి

నాలుగు మండలాలనూ పంచేసుకున్న నేతలు

భారీ టిప్పర్లతో రోడ్లు ధ్వంసం

చర్యలు తీసుకుంటాం

అనుమతులు లేని టిప్పర్లపై చర్యలు తీసు కుంటాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మైనింగ్‌ చేయాలి. కై కలూరు మండలంలో అక్రమ మైనింగ్‌ నిర్వహించే వ్యక్తుల వివరాలను తెలపాలని ఆయా గ్రామాల వీఆర్వోలకు అదేశాలు ఇచ్చాం. పోలీసులతో కలిసి దాడులు, తనిఖీలు చేస్తాం.

–ఎండీ ఇబ్రహీం, తహసీల్దార్‌, కై కలూరు

ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం

కూటమి నేతలు ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నారు. నియోజకవర్గంలో శీతనపల్లి, వదర్లపాడు, వేమవరప్పాడు, శృంగవరప్పాడు, గుమ్మళ్లపాడు, అగ్రహారం, సున్నంపూడి, తాడినాడ, గోపాలపురం, సానారుద్రవరం, కోరుకొల్లు, గన్నవరం, వణుదుర్రు, పెదగొన్నూరు, కొత్తపల్లి, ఆచవరం గ్రామాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. టిప్పరు మట్టిని రూ.3,500కి విక్రయిస్తున్నా రు. భీమవరానికి రూ.8,500 వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్‌ మట్టిని రూ.1,010కి విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం క్యూబిక్‌ మీటరుకు రూ.114 సినరేజీ కట్టాలి. అంటే ఎకరానికి 4,200 క్యూబిక్‌ మీటర్లుకు గాను రూ.4,78,800 చెల్లించాలి. అలాగే హెక్టారుకు ప్రీమియం కింద రూ.6 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇలా నియోజకవర్గంలో రూ.కోట్లాది ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
కూటమి మట్టి మాఫియా 1
1/3

కూటమి మట్టి మాఫియా

కూటమి మట్టి మాఫియా 2
2/3

కూటమి మట్టి మాఫియా

కూటమి మట్టి మాఫియా 3
3/3

కూటమి మట్టి మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement