
ఎరువుల దుకాణం తనిఖీ
భీమడోలు: స్థానిక సంతమార్కెట్ వద్ద గల సత్యదుర్గా ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని సోమవారం మండల వ్యవసాయాధికారిణి ఎస్‌పీవీ ఉషారాణి, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్‌లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. దుకాణంలో 367 బస్తాల ఎరువులను రైతులకు విక్రయించగా రైతులకు బిల్లులు ఇవ్వకపోవడం, స్టాక్ నిల్వల్లో తేడాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పోస్ మిషన్‌లో అమ్మకాలు నమోదులోను అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల బృందం గుర్తించారు. దుకాణంలో నిల్వ ఉన్న రూ.32760 విలువ గల 126 బస్తాలను సీజ్ చేశారు. నిత్యావసర చట్టం ప్రకారం దుకాణం యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఏడీఏ ఆర్.గంగాధర్ సిఫారసు చేశారు. ఈ తనిఖీల్లో వీఏఏ ఎం.రూపాదేవి, వీఆర్వోలు కె.వీరప్రతాస్, వి.వినయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment