
పాము కాటుతో యువకుడు మృతి
కై కలూరు: పొట్టకూటి కోసం చేపల పట్టుబడికి అమరావతి వెళ్లిన యువకుడు పాము కాటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కై కలూరు మండలం శృంగవరప్పాడు గ్రామానికి చెందిన జయమంగళ నాగరాజు, మరియమ్మలకు ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు బతుకుదెరువు కోసం కర్ణాటక రాష్ట్రం వెళ్లాడు. చిన్న కుమారుడు జయమంగళ జాన్(18) పదో తరగతి వరకు చదివి తల్లదండ్రులకు ఆసరాగా మారాడు. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన 11 మందితో కలసి అమరావతిలో చేపల చెరువు పట్టుబడి నిమిత్తం వాహనంలో వెళ్లారు. తెల్లవారుజామున 3 గంటలు కావడంతో ఉదయం చేపల పట్టుబడి చేద్దామని చెరువు గట్టు షెడ్డులో అందరూ నిద్రించారు. ఆ సమయంలో జాన్ పాము కాటుకు గురయ్యాడు. అయితే నిద్రమత్తులో ఉన్న జాన్ ఈ విషయం గమనించలేదు. ఉదయం రక్తపువాంతులు చేసుకోవడంతో అతడిని సమీపంలో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. అతను పాము కాటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఇంటికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment