
అదుపు తప్పి ఆటో బోల్తా
నూజివీడు: పట్టణంలోని రామాయమ్మరావుపేట వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో సోమవారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిలో ఆటో డ్రైవర్ కాకుండా మిగిలిన 17 మంది మహిళలే. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడు పట్టణంలోని కొప్పెలమపేటకు చెందిన మహిళలు పట్టణ పరిధిలోని సరస్వతీ ఆలయం సమీపంలో ఉన్న ప్రియా పచ్చళ్ల కంపెనీలో పనిచేసేందుకు ప్రతిరోజూ వెళ్తారు. వీరు ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు. దీనిలో భాగంగానే సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు డ్యూటీ దిగి 17 మంది మహిళలు ఆటోలో ఇంటికి వెళ్తుండగా రామాయమ్మరావుపేటలోని అన్న క్యాంటీన్ సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా కారు సందులో నుంచి రోడ్డుమీదకు వస్తుండటంతో దానిని తప్పించేందుకు ఆటోను డ్రైవర్ ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో ఆటో అదుపు తప్పి పక్కకు పడిపోయి పల్టీలు కొట్టి కరెంటు స్తంభాన్ని ఢీకొంది. స్థానికులు హుటాహుటిన క్షతగ్రాతులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్ వైకుంఠపు అప్పలనాయుడు(40), సబ్బవరపు వరలక్ష్మి(40), నారగాని ఆదిలక్ష్మి(40), గేదెల వెంకటలక్ష్మి(50)లకు ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రథమ చికిత్సనందించి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మిగిలిన 14 మందికి ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స నందిస్తున్నారు.
సామర్థ్యానికి మించి ఎక్కడమే కారణమా?
డ్రైవర్‌తో కలిపి ఐదుగురు ఎక్కాల్సిన ఆటోలో సామర్థ్యానికి మించి 18 మంది ఎక్కడమే ప్రమాదానికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నూజివీడు పట్టణంతో పాటు రెడ్డిగూడెం, ఇతర గ్రామాల నుంచి కూడా ఇదే విధంగా ఓవర్‌లోడుతో ఆటోల్లో ప్రియా పచ్చళ్ల కంపెనీకి డ్యూటీ నిమిత్తం వచ్చి వెళ్తూంటారు. ఇంతకు ముందు వర్కర్ల కోసం బస్సును నడిపిన కంపెనీ కరోనా నుంచి ఆ సదుపాయాన్ని తొలగించింది. దీంతో అప్పటి నుంచి మహిళా వర్కర్లు ఆటోల్లోనే కంపెనీకి వచ్చి వెళ్తున్నారు. పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురికి తీవ్ర, 14 మందికి స్వల్ప గాయాలు
ప్రియా పచ్చళ్ల కంపెనీలో పని కోసం వెళ్తూ గాయపడిన మహిళలు

అదుపు తప్పి ఆటో బోల్తా

అదుపు తప్పి ఆటో బోల్తా
Comments
Please login to add a commentAdd a comment