
ఐపీఎస్ సునీల్‌కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని ధర్నా
భీమవరం (ప్రకాశంచౌక్): దళిత ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌పై సస్పెన్షన్ విధించడాన్ని దళిత జేఏసీ సంఘాల సభ్యులు ఖండించారు. సోమవారం భీమవరం అంబేద్కర్ సెంటర్‌లో దళిత జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేయడం దారుణమని దళిత జేఏసీ నాయకులు బండి మధు, గంటా సుందర్ కుమార్, కోనా జోసెఫ్, కేసీ రాజు అన్నారు. దళిత నాయకులు విమానాలు ఎక్కకూడదా .. ఎక్కితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. విల్లింగ్ ఇచ్చిన రెండోరోజున సస్పెండ్ చేయడం దళిత జాతిని అవమానించినట్లేనని, రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సునీల్ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేసి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అలురి చిన్నారావు, ఈది రవికుమార్, బేతల కమలాకర్, దర్మద, జి సందీప్, బి నాగరాజు, కేవీ రత్నం, వై జోసెఫ్, బొంగ ఆదాము, పిల్మి శేఖర్, జి బాలఏసు, ఎం.పీటర్ పాల్, ఎం.బెంజిమెన్, ఎండి శామ్యూల్, ఎం.ఏసురత్నం, వి ప్రశాంత్, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment