చురుగ్గా పోలవరం ప్రాజెక్టుజంట సొరంగాల పనులు
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్‌వాల్ నిర్మాణం పనులతో పాటు కుడి కాలువను అనుసంధానం చేసే ప్రాజెక్టు అనుబంధ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు జిల్లా పోలవరం మండలం తోటగొంది, మామిడిగొంది, దేవరగొంది గ్రామాల మధ్య గల జంట సొరంగాల పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండు సొరంగాలను వెడల్పు చేస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ ఛానల్ పనులు కూడా జరుగుతున్నాయి. 63వ ప్యాకేజీలో టన్నెల్ 715 మీటర్లు, 64వ ప్యాకేజీలో టన్నెల్ 826 మీటర్ల పొడవునా తవ్వకం పనులు జరిగాయి. సొరంగాల్లో షాట్ గ్రేటింగ్ పనులు జరుగుతున్నాయి. టన్నెల్స్‌లో లైనింగ్ పనులు చేపట్టేందుకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో లైనింగ్ పనులు ప్రారంభించడం జరుగుతుందని ఈఈ బాలకృష్ణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment