వృద్ధురాలిపై దాడి, బంగారు నగల దోపిడీ
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి బంగారు నగలు దోపిడీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సాయి స్ఫూర్తి ఆసుపత్రి సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న 70ఏళ్ల రిటైర్డ్ ఉర్దూ టీచర్ షేక్ ఫాతిమున్నీసా ఇంటికి గుర్తు తెలియని 40 నుంచి 45 వయసు కలిగిన ముగ్గురు వ్యక్తులు మధ్యాహ్నం సమయంలో వచ్చినట్లు ఫాతిమున్నీసా తెలిపారు. ఇల్లు అద్దెకు కావాలంటూ ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఫాతిమున్నీసాపై దాడి చేశారు. ఆమె అరవకుండా నోరు నోక్కేసి ఆమె చేతికి ఉన్న 5 కాసుల బంగారు గాజులు, మెడలో ఉన్న 3 కాసుల చంద్రహారం దోపిడీ చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఫాతిమున్నీసా చేతికి తీవ్ర గాయం కాగా, స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యులు సుమారు 8 కుట్లు వైద్యులు వేశారు. ఘటనపై ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment