జీసీసీలో టార్గెట్ పూర్తి చేయకపోతే చర్యలు
బుట్టాయగూడెం: గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా నిర్వహిస్తున్న డిపోల్లో అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు, విక్రయాల టార్గెట్ పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్ హెచ్చరించారు. మండలంలోని కేఆర్‌పురం ఐటీడీఏలో సేల్స్‌మెన్‌లు, సిబ్బందితో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 26 జీసీసీ డిపోల ద్వారా గిరిజన ఉత్పత్తులు అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరైనా అలసత్వం వహిస్తే బదిలీలు తప్పవని అన్నారు. అటవీ ఉత్పత్తులు తప్పనిసరిగా గిరిజనుల నుంచి కొనుగోలు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తులను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్పత్తులు సేకరించే సమయంలో గిరిజనులు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో జీసీసీ అకౌంటెంట్ రాజయోగి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment