పన్ను వసూళ్లలో జాప్యం
జంగారెడ్డిగూడెం: జిల్లాలోని మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నెలాఖరునాటికి 100 శాతం పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఏ మున్సిపాలిటీలోనూ 50 శాతం వసూళ్లు మించలేదు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీ ఉన్నాయి. ఈ నాలుగు మున్సిపాలిటీల్లోనూ మొత్తంగా రూ.83.64 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా, కేవలం రూ.47.36 కోట్లు మాత్రమే వసూలైంది. మొత్తంగా 43.38 శాతం మాత్రమే ఆస్తిపన్ను వసూలైంది.
ఆయా మున్సిపాలిటీల్లో గత ఏడాది వరకు ఉన్న బకాయిలు, ఈ ఏడాది ఆస్తి పన్ను మొత్తం కలిపి వరుసగా, ఏలూరు కార్పొరేషన్‌లో రూ.60.44 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.25.79 కోట్లు మాత్రమే వసూలైంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పాత బకాయిలు, ఈ ఏడాది పన్ను కలిపి రూ.11.34 ట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.5.38 కోట్లు వసూలైంది. నూజివీడు మున్సిపాలిటీలో పాత బకాయిలు, ఈ ఏడాది కలిపి రూ.9.53 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.4.16 కోట్లు వసూలైంది. చింతలపూడి నగర పంచాయతీలో పాత బకాయిలు, ఈ ఏడాది కలిపి రూ.2.32 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, రూ.0.95 కోట్లు మాత్రమే వసూలైంది.
ఇదిలా ఉంటే జిల్లాలో మున్సిపాలిటీల్లో వరుసగా చూస్తే ఆస్తి పన్ను వసూళ్లలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 47.43 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో నూజివీడు, మూడో స్థానంలో ఏలూరు కార్పొరేషన్, నాలుగో స్థానంలో చింతలపూడి నగర పంచాయతీ ఉన్నాయి.
మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా వసూలు కాని వైనం
జంగారెడ్డిగూడెం పట్టణం
Comments
Please login to add a commentAdd a comment