స్పందన
మోదేలులో వాటర్ ట్యాంక్ ఏర్పాటు
బుట్టాయగూడెం: గతనెల 25న సాక్షి దినపత్రికలో ప్రచురించిన ‘దశాబ్దాలుగా చీకట్లోనే’ కథనంపై అధికారులు స్పందించారు. మోదేలు గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలో 5 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంక్ నిర్మించడంతోపాటు గ్రామంలోని 15 ఇళ్లకు పైప్‌లైన్‌లు ఏర్పాటు చేసి ఇంటింటికీ ట్యాప్ నీరు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జలజీవన్ మిషన్ పథకంలో సుమారు రూ.6.50 లక్షలు మంజూరయ్యాయని ఆ నిధులతో గ్రామంలో మంచినీటి సమస్య తలెత్తకుండా సోలార్ సిస్టమ్ ద్వారా నీరు వాటర్ ట్యాంక్‌లకు వెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నామని వేలేరుపాడు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ గుజ్జెల జగదీష్ తెలిపారు.
దూరవిద్య ఇంటర్ పరీక్షకు 454 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో బుధవారం తెలుగు పేపర్ బుధవారం నిర్వహించారు. పరీక్షకు 511 మందికి గాను 454 మంది విద్యార్థులు హాజరు కాగా, హిందీ పరీక్షకు 17 మందికి 15 మంది హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు నలుగురు హాజరయ్యారు.
ఉపాధి హామీలో పనులు కల్పించాలి
ఏలూరు (టూటౌన్): ఉపాధి లేని గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి వలసలను నివారించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) నాయకులు బుధవారం వినతిపత్రం సమర్పించారు. బీకేఎంయు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరులో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గ్రామీణ పేదల వలసల నివారణ కోసం ఉపాధి హామీ పనులు కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు కల్పించి, రోజు కూలీ రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు బకాయి పడ్డ డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గొలిమే బాల యేసు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బుధవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్–2లో చోటు చేసుకున్న రెండు ప్రశ్నలకు విద్యార్థులు గందరగోళానికి గురయ్యారని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రంలో రోమన్ నెంబర్ 8లో 5 మార్కుల ప్రశ్నకు సంబంధించి, రోమన్ నెంబర్ 13లో మరో 5 మార్కుల ప్రశ్న అర్థంకాకుండా ఉండడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారన్నారు. ఈ మేరకు విద్యార్థులు విలువైన 10 మార్కులు కోల్పోయే ప్రమాదంలో పడ్డారని ఇందుకుగాను ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
చింతలపూడి: 5వ తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు ఇంటర్ మొదటి, డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశ పరీక్షకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాగిరెడ్డిగూడెం ఏపీఆర్ బాలికల గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్ మండలి బ్రాహ్మణేశ్వరమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 లోగా దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. 5, 6, 7, 8వ తరగతి వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంటర్, డిగ్రీ ప్రథమ సంవత్సరాలకు మధ్యాహ్నం రెండు 2:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
స్పందన
స్పందన
Comments
Please login to add a commentAdd a comment