రగులుతున్న కొల్లేరువాసులు
కై కలూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొల్లేరు ప్రజలు రగిలిపోతున్నారు. తమ జీవనోపాధికి అడ్డువస్తే అటవీ అధికారులను అడ్డుకుంటాం అంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల ధ్వంసంపై సుప్రీంకోర్టు విధించిన గడువు దగ్గరపడటంతో అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గురువా రం మండలంలోని గోకర్ణపురం గ్రామం వద్ద కొల్లేరు అభయారణ్యంలో సాగువుతున్న సుమారు 100 ఎకరాల (మూడు చెరువులు)కు గండ్లు కొట్టేందుకు అటవీశాఖ రేంజర్ కేపీ రామలింగాచార్యులు, డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ రంజిత్‌కుమార్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజ్‌కుమార్, 20 మంది సిబ్బందితో కలిసి వచ్చారు. విషయం తెలిసిన కొల్లేరు వడ్డీ సాధికారత చైర్మన్ బలే ఏసురాజు, జనసేన నేత కొల్లి బా బీ, గ్రామస్తులు అధికారులు వద్దకు రాగా వాదోపవాదాలు జరిగాయి. జిల్లా అటవీ అధికారికి వినతిపత్రాలు ఇస్తామని, చెరువుల జోలికి రావద్దని గ్రామస్తులు చెప్పడంతో అటవీ సిబ్బంది వెనుదిరిగారు.
గండ్లు కొట్టిన చెరువుల్లోనే సాగు
కొల్లేరు ఆపరేషన్ సమయంలో గట్లు కొట్టేసిన చెరువుల్లో నిల్వ ఉన్న నీటిలోనే చేప పిల్లలు పెంచుతున్నామని, కొత్తగా చెరువులు తవ్వలేదని బలే ఏ సురాజు చెప్పారు. శుక్రవారం జిల్లా అటవీ అధికారిని కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment