పంచాయతీ స్థలం ఆరకమణ.. ముగ్గురి అరెస్ట్
టీడీపీ నేతతో పాటు మరో ఇద్దరికి రిమాండ్
ఉంగుటూరు: నారాయణపురం పంచాయతీకి చెందిన ఆరు సెంట్ల స్థలాన్ని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన కేసులో తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు గంటా యువరాజు, అతడికి సహకరించిన సీపాని శివబాలాజీ, చిగురుపల్లి దాలేశ్వరరావును గురువారం అరెస్ట్ చేసి తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. మోసపూరితంగా పంచాయతీ స్థలాన్ని కాజేయాలనే రిజిస్ట్రేషన్ చేసిన నేరంపై వీరిని అరెస్ట్ చేశామన్నారు. ఎస్సై సూర్యభగవాన్, కానిస్టేబుళ్లు ఆక్రమిత స్థలాన్ని పరిశీలించారు. పంచాయతీ స్థలం రక్షణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి విజయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment