గిరిజన మహిళ.. ఉపాధి భళా
బుట్టాయగూడెం: చిరుధాన్యాలను ఆదాయ వనరుగా మార్చుకుని స్వయం ఉపాధి పొందుతూ భళా అనిపిస్తున్నారు గిరిజన మహిళలు. కేఆర్ పురం ఐటీడీఏ సహకారంతో పౌష్టికాహార బిస్కెట్లు, పౌడర్లు తయారు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ఓ కుగ్రామంలో ప్రారంభించిన వీరి వ్యాపారం ఇప్పుడు ఢిల్లీ వరకూ చేరింది. బుట్టాయగూడెం మండలం రాజానగరం, బండార్లగూడెంకు చెందిన గిరిజన మహిళలు 30 మంది 2016లో ఆహార ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక శిక్షణ పొంది ఐటీడీఏ కార్యాలయం వద్దే 12 రకాల చిరుధాన్యాలతో మల్టీగ్రెయిన్ బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకుని ఉత్పత్తులు తయారీ చేసి విక్రయిస్తున్నారు. అమెజాన్ వంటి సంస్థల ద్వారా ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఇటీవల టాటా కంపెనీ ఏర్పాటు చేసిన సమావేశం కోసం వీరికి ఆర్డర్ వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వీరి ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీరి ఉత్ప త్తులకు ఆదరణ బాగుండటంతో ఆదాయం కూడా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment