వైఎస్సార్‌సీపీ నేతలకు రాష్ట్ర పదవులు
ఏలూరు టౌన్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులకు రాష్ట్ర ప దవులు కేటాయించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఏలూరుకు చెందిన భాస్కర్ల ఆర్‌ఎన్ శంకర్ (బాచీ) ను రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా నియమించారు. అలాగే రామిశెట్టి సత్యనారాయణను వాణిజ్య విభాగ కార్యదర్శిగా, లంకలపల్లి వెంకట గణేష్‌ను రాష్ట్ర మేధావుల ఫోరంజాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు నియోజకవర్గంలో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న నాయకులకు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పదవుల కేటాయింపులో ప్రాధాన్యమిచ్చారు.
నీటి కష్టాలకు చెక్
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలో తాగునీటి సమస్యపై ‘ప్రజల నీటి కష్టాలు!’ శీర్షికన శని వారం ‘సాక్షి’లో ప్ర చురించిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కుళాయిలు వస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో మోటార్ల ద్వారా కొందరు అక్రమంగా నీటిని తోడుతున్నారని, దీంతో పలు ప్రాంతాలకు కుళాయి నీరు రావడం లేదని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ‘సాక్షి’ కథనంపై స్పందించిన మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు కుళాయిలు వచ్చే సమయంలో ఉదయం, సాయంత్రం అరగంట సేపు విద్యుత్ సరఫరా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మూడు రోజులుగా తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో కుళాయిల ద్వారా నీరందింది.
‘వైద్యసేవ’ ఉద్యోగుల విధుల బహిష్కరణ
భీమవరం(ప్రకాశం చౌక్): డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10, 17, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరిస్తున్నామని ఏపీ వైద్య సేవ ఎంప్లాయీస్ జేఏసీ సంఘ నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని బీమా పరిధిలోకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తోందని, ఆప్కాస్ రద్దు దిశగా ఇప్పటికే అడుగులేసిందన్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. విధుల బహిష్క రణతో పాటు జిల్లా సమన్వయకర్త అధికారి కా ర్యాలయం వద్ద నిరసన తెలుపుతామన్నారు.
సమస్యలపై సైకిల్ యాత్ర
భీమవరం(ప్రకాశం చౌక్): పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సమస్యల పరిష్కరించాలని, టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లాలోని 20 మండలాలు, ఆరు పట్టణాల్లో సైకిల్ యాత్ర చేపట్టినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ తెలిపారు. భీమవరం టిడ్కో ఇళ్ల వద్ద గోపాలన్ ఆధ్వర్యంలో 15 మంది నాయకులతో చేపట్టిన యాత్రను రాష్ట్ర కమి టీ సభ్యుడు బి.బలరాం ప్రారంభించారు. బల రామ్ మాట్లాడుతూ యాత్ర 17 వరకు సాగుతుందని, పేదల ఇళ్ల సమస్యలు, కాలనీల్లో సౌకర్యాలను తెలుసుకుంటామన్నారు. కూట మి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మహిళల విద్యతోనే దేశాభివృద్ధి
భీమవరం(ప్రకాశం చౌక్): మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు కోడే విజయమ్మ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవానికి శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఎక్కడ సీ్త్రలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లో మరింత రాణిస్తారన్నారు. మనదేశంలో మహిళలకు ఉన్న గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. అనంతరం ఐదుగురు మహిళలను సత్కరించారు. పార్టీ నేతలు కోడే యుగంధర్, కామన నాగేశ్వరరావు, గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, చిగురుపాటి సందీప్, విప్పర్తి సత్యవేణి, చవ్వాకుల సత్యనారాయణ, బొమ్మిడి శాంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment