మద్యం దుకాణంపై మండిపాటు
ఆగిరిపల్లి: జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని మహిళలు హెచ్చరించారు. ఆగిరిపల్లిలోని జంక్షన్ రోడ్డులో మడుపల్లి కాంప్లెక్స్ ఎదురుగా జనావాసాల మధ్య షాపు ఏర్పాటుకు రంగం సిద్ధం చేయగా ఉదయం స్థానికులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఓ పక్క ప్రభుత్వ పాఠశాల, మరోపక్క శోభనాచలస్వామి కల్యాణ మండపం, చుట్టూ నివాసాలు ఉన్నా పట్టించుకోరా అంటూ మండిపడ్డారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో నిర్వాహకులు షాపును రాత్రికి శోభనాచల స్వామి ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డులోని మార్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం సీసాల కేసులను షాపులో సిబ్బంది సర్దుతుండగా అక్కడి మహిళలూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా వాహనాలు స్తంభించాయి. ఏఎస్సై నాయక్ ఆందోళనకారులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఇదే విషయమై ఎకై ్సజ్ సీఐ మస్తానయ్యతో ఫోన్‌లో మాట్లాడగా దుకాణంలోని మద్యం సీసాలను వ్యాపారి ఒక్కరాత్రికి ఇక్కడ ఉంచి ఆదివారం ఉదయం వేరేచోటుకు తీసుకువెళతారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment