మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక సీఆర్‌రెడ్డి డిగ్రీ కాలేజీ ఆడిటోరియంలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు 181 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ మాట్లాడుతూ మహిళల అక్రమ రవాణా నిరోధానికి పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెడుతున్నారన్నారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మహిళా సాధికారతకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు మాట్లాడారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పలు పథకాలు, కార్యక్రమాల కింద మహిళలకు రూ.131.82 కోట్ల రుణాల చెక్కులను మంత్రి మనోహర్ చేతులమీదుగా అందజేశారు.
పోలీస్ డార్మిటరీ నిర్మాణానికి శంకుస్థాపన
ఏలూరు టౌన్: ఏలూరు ఫైర్‌స్టేషన్ సమీపంలో మహిళా పోలీసుల డార్మిటరీ నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.64.80 లక్షలతో నిర్మించనున్న భవనానికి మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డార్మిటరీ నిర్మించడం అభినందనీయమని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి మనోహర్
Comments
Please login to add a commentAdd a comment