కాంరకీట్ లిఫ్ట్ తెగిపడి కానరాని లోకాలకు..
తాడేపల్లిగూడెం అర్బన్: నిర్మాణ భవనానికి శ్లాబ్ వేస్తున్న సమయంలో కాంక్రీట్ లిఫ్ట్ బకెట్ తెగిపడటంతో ఓ మహిళా కూలీ దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలైన సంఘటన తాడేపల్లిగూడెంలోని 5వ వార్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 5వ వార్డులోని రామాలయం వీధిలో ఆదివారం ఓ భవనానికి మూడో అంతస్తు నిర్మాణం కోసం శ్లాబ్ వేస్తున్నారు. జట్లపాలెంలోని గంగిరెడ్డ కాలనీకి చెందిన చింతా రమణమ్మ (30), ఆవుల వెంకన్న, బీరా వెంకటేశ్వరరావు, మరికొందరు కూలీలు పనిచేస్తున్నారు. వీరంతా కింద పనులు చేస్తుండగా కాంక్రీట్‌ను పైకి తరలించే లిఫ్ట్‌కు ఉన్న ఇనుప తీగ తెగిపడటంతో రమణమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. కాంక్రీట్ మోస్తున్న ఆవుల వెంకన్న, బీరా వెంకటేశ్వరరావు తలలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకన్న తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోగా మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రమణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, పట్టణ సీఐ ఎ.సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూలి పనులే ఆధారం
మృతురాలు రమణమ్మ, భర్త కోటయ్యలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణమ్మ మృతితో భర్త, పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
భవన యజమానికి కూటమి అండ!
మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు భవన యజమానిని వేడుకోగా తనకు ప్ర జాప్రతినిధుల అండదండలున్నాయని, ఏం చేసుకుంటారో చేసుకోండని దురుసుగా మాట్లా డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానికి కూటమి వర్గానికి చెందిన కొందరు నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మృతురాలు రమణమ్మ కుటుంబంతో పాటు కోమాలోకి వెళ్లిన వెంకన్న కుటుంబాన్నీ ఆదుకోవాలని కోరుతున్నారు.
నిర్లక్ష్యంతోనే ప్రమాదం
భవన నిర్మాణ ప్రాంతంలో కాంక్రీట్ లిఫ్టును ఇనుప రాడ్లతో పకడ్బందీగా ఏర్పాటుచేయాల్సి ఉంది. అయితే నామమాత్రంగా కర్రలతో కట్టడంతో కర్రలు విరిగి, ఇనుప తీగలు తెగి ప్రమాదం జరిగిందని బంధువులు అంటున్నారు.
మహిళా కూలీ దుర్మరణం
మరో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
కాంరకీట్ లిఫ్ట్ తెగిపడి కానరాని లోకాలకు..
కాంరకీట్ లిఫ్ట్ తెగిపడి కానరాని లోకాలకు..
Comments
Please login to add a commentAdd a comment