అంగన్‌వాడీలపై ఉక్కుపాదం దారుణం
ఏలూరు (టూటౌన్): అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సోమవారం విజయవాడలో మహా ధర్నా నిర్వహించ తలపెట్టగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం తగదని సీఐటీయూ ఏలూరు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మహాధర్నాకు వెళ్లకుండా నాయకులను నిర్బంధించడం, నోటీసులు ఇవ్వ డం, బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందు అంగన్‌వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వారి సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయడం అన్యాయన్నారు.
అక్రమ అరెస్ట్‌లు ఆపాలి : అంగన్‌వాడీల ముందస్తు అరెస్టులు నిలిపివేయాలని, ప్రజాస్వామ్యతంగా ధర్నా చేసేందుకు అవకాశం ఇవ్వాలని దళిత, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక అన్నే భవనంలో ఆదివారం భారతీయ బౌద్ధ మహాసభ చైర్మన్ ఆర్.మనీ సింగ్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ.శ్యామల రాణి, కెవిపిఎస్, ఏపీ రైతు సంఘం, సీఐటీయూ నాయకులు సమావేశం నిర్వహించి అంగన్‌వాడీల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
ఇఫ్టూ ఖండన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంగన్‌వాడీలపై నిర్బంధాన్ని ప్రయోగించడం సరైనది కాదని భారత కార్మి క సంఘాల సమైక్య ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ రమణ, బద్దా వెంకట్రావు ఒక ప్రకటనలో ఖండించారు.
నిర్బంధం తగదు
కుక్కునూరు: విజయవాడలో ధర్నాకు వెళ్లనున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులను నిర్బంధించడం దారుణమని సీఐటీయూ మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్ అన్నారు. ఆదివా రం సాయికిరణ్‌ను తన ఇంటి వద్ద పోలీసులు ని ర్బంధించడాన్ని నిరసిస్తూ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment