
ఆరోగ్యశ్రీ సేవలు బంద్
ఏలూరు టౌన్: పేదోడికి పెద్ద రోగమొస్తే రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉన్నత లక్ష్యానికి తూట్లు పొడుస్తూ కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి చూపుతోంది. ఆరోగ్యశ్రీ వైద్య సేవలందించే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు బకా యిలు చెల్లింపుపై మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. దీంతో మరోసారి నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్యచికిత్సలు, సేవలు అందించలేమని చెప్పడంతో పేదల ఆరో గ్యం ప్రమాదంలో పడిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరోగ్యశ్రీ పథకం స్థానంలో బీమా పథకాన్ని తీసుకువస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేద వర్గాల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వంలో నిర్విరామంగా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. రూ.వెయ్యి ఖర్చు అయ్యే సేవలను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చి భరోసా కల్పించారు. ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చారు. ఇలా గత ఐదేళ్లలో పేదల ప్రాణాలకు సంజీవనిలా ఆరోగ్యశ్రీ పథకం నిలిచిందనటంలో సందేహం లేదు. పేదలు శస్త్ర చికిత్సలు చేయించుకుని ఇంటికి వెళితే ఉపాధి లేక సరైన పౌష్టికాహారం అందదనే ఉద్దేశంతో ఆరోగ్య ఆసరా పథకం కింద ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు.
జిల్లాలో సేవలు ఇలా..
జిల్లాలో 2023–24లో 20,826 మందికి వైద్య సేవలు అందించారు. రూ.49 కోట్లు ఖర్చు చేశారు.
2024–25లో 7,129 మందికి వైద్య సేవలు అందించారు. రూ.14 కోట్లు వెచ్చించారు.
2023–24లో 15,623 మందికి ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.9 కోట్లు అందించారు. కూటమి పాలనలో ఈ పథకాన్ని నిలిపివేశారు.
నేడు..
నాడు..
పేదల ఆరోగ్యం.. గాల్లో దీపం!
నేటినుంచి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సేవలు నిలుపుదల
బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం
పేదల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి పెద్దపీట
కూటమి సర్కారు పాలనలో పేదల ఆరోగ్యాన్ని గాల్లో దీపంలా మార్చివేశారు. పేదలకు అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ పథకం ఉందనే భరోసా లేకుండా చేశారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్‌టీఆర్ వైద్య సేవ కింద పేరు మార్పు చేశారు. అలాగే పథకాన్నే లేకుండా చేసే కుట్రకు కూటమి సర్కారు తెరతీసిందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.3,600 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉంటే వాటిని చెల్లించకుండా కొత్తగా బీమా విధానాన్ని తీసుకువస్తామని సర్కారు చెబుతోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి పెద్దపీట వేశారు. 3,257 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కరోనా విపత్తు సమయంలోనూ ఉచితంగా వైద్య సేవలు అందించి నేనున్నానంటూ ఆదుకున్నారు. పేదలకు పెద్ద రోగమొచ్చినా కార్పొరేట్ వైద్యాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందించి నయం చేసి ఇంటికి క్షేమంగా పంపించారు. అలాగే ఆరోగ్యశ్రీలో సేవలు పొందిన రోగులు, బాలింతలకు ఆరోగ్య ఆసరా పథకం కింద ఆర్థిక సాయం చేశారు.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో సేవలు అందిస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించేందుకు చర్యలు తీసుకుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ పూర్తిస్థాయిలో వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించగా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో పేదలకు ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందేలా చర్యలు చేపడుతున్నాం. ప్రభు త్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనేది తెలియజేస్తాం.
– డాక్టర్ ఐ.రాజీవ్, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్
పేదల ప్రాణాలతో చెలగాటం
కూటమి ప్రభుత్వం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. 2019లో టీడీపీ అధికారం నుంచి తప్పుకున్న నాటికి ఆరోగ్యశ్రీ పథకానికి వేల కోట్లు బకాయిలు పెడితే అప్పుడు అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం జగన్ బకాయిలన్నీ చెల్లించారు. అయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు పేదలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆరోగ్య భరోసా లేకుండా చేసేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. పథకాన్ని ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
–దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

ఆరోగ్యశ్రీ సేవలు బంద్

ఆరోగ్యశ్రీ సేవలు బంద్

ఆరోగ్యశ్రీ సేవలు బంద్