Do You Know 'Bourton-on-the-Water' Village In England - Sakshi
Sakshi News home page

Bourton On The Water Village: నది మధ్యలో స్వర్గం లాంటి అందాల పల్లెటూరు

Published Mon, Jul 3 2023 11:23 AM | Last Updated on Fri, Jul 14 2023 3:52 PM

Do You Know Bourton On The Water Village In England - Sakshi

ఊళ్లలోని దృశ్యాలు సాధారణంగా అంత అందంగా ఉండవు. ఊరికి అవతల ఉండే పొలాలు, తోటలు కొంత అందంగా కనిపించినా, ఊళ్లలోని వీథుల్లోకి అడుగుపెడితే చెత్తచెదారాలు తారసపడతాయి. ఇరుకిరుకు ఇళ్లు కనిపిస్తాయి. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఊళ్లలోని దృశ్యాలు అంత అందంగా ఉండవు. ఊళ్లలోని పరిస్థితులు అంత అద్భుతంగానూ ఉండవు. అయితే, అందాల తేరులాంటి ఊరు ఒకటి ఉంది. బహుశా అది ప్రపంచంలోనే అత్యంత అందమైన ఊరు.

అలాగని అదేమీ అంత ఘనమైన గ్రామం కాదు, మారుమూలనున్న కుగ్రామం. ఆ ఊరును చూస్తే, ఊరు కాదు ఉద్యానవనం అనుకుంటారు ఎవరైనా! ఇంగ్లండ్‌లో ఉన్న ఆ ఊరి పేరు బర్టన్‌–ఆన్‌–ద–వాటర్‌. కొత్తగా వచ్చే పర్యాటకులు చూడటానికి థీమ్‌పార్కులా కనిపించే ఈ ఊళ్లోకి అడుగుపెడితే, డబ్బులు అడుగుతారేమోనని జంకుతారు గాని, ఈ ఊళ్లోకి ప్రవేశం ఉచితం. ఈ సంగతిని ఈ ఊరి అధికారిక వెబ్‌సైట్‌ స్పష్టంగా చెబుతుంది. దాదాపు నాలుగువేల జనాభా ఉండే ఈ ఊళ్లోని ఇళ్లన్నీ పాతకాలం పద్ధతిలో నిర్మించిన పెంకుటిళ్లే!

ఇక్కడి దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటాయి. విండ్‌రష్‌ నది మధ్యలో ఉన్న ఈ గ్రామానికి చేరుకోవడానికి ఐదు వంతెనల మీదుగా దారులున్నాయి. రోడ్డు మార్గంలో లండన్‌ నుంచి ఇక్కడకు రెండుగంటల్లోగా చేరుకోవచ్చు. పరిశుభ్రమైన వీథులు, నది ఒడ్డున పచ్చిక బయళ్లు, చుట్టూ చెట్టూ చేమలతో నిండిన పరిసరాలతో బర్టన్‌–ఆన్‌–ద–వాటర్‌ భూతలస్వర్గాన్ని తలపిస్తుంది. ఇంగ్లండ్‌ వాసులతో పాటు, విదేశీ పర్యాటకులు కూడా ఈ ఊరిని చూడటానికి వస్తుంటారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement