
Fish Swallows One Meter Long Snake: చేప పాములను వేటాడటం కాని, వేటాడి గులాబ్‌జామ్ మింగినట్టు పామును మింగడం ఎప్పుడైనా చూశారా?.. ఏదో చిన్న పాముపిల్లను మింగి ఉంటుందిలేనని అనుకునేరు.!! కాదండీ.. ఏకంగా మూడున్నర అడుగుల (మీటరు పొడవున్న) పాము..
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చేపలను, ఇతర జంతువులను పాములు వేటాడటం మనకు తెలుసు! కానీ రొటీన్‌కు భిన్నంగా ఓ చేప సరికొత్త రికార్డు సృష్టించింది. అసలు ఏ రకం చేపై ఉంటుంది... పాములను మింగగలిగేతంట ధైర్యమా దానికి.. అననుకుంటున్నారా? దాని విశేషాలు మీకోసం.
నది ఒడ్డున నీళ్లలో ఉన్న ఓ చేప, పొదల్లో నుంచి నీళ్లలో తలను పెట్టిన పామును స్లోగా మింగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. వేలల్లో వీక్షిస్తున్న నెటిజన్లు ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఓ మై గాడ్..! ఇది ఎలా సాధ్యం అని ఒకరు, నా కళ్లను నమ్మలేకపోతున్నాను, ఇది నిజమేనా అని మరొకరు కామెంట్ చేశారు. మరి మీరేమంటారు..
ఏది ఏమైనా ఈ చేప మామూలుది కాదు కదా..
చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!!