భారత్, ఇజ్రాయెల్ మధ్య సౌహార్ద సంబంధాల పట్ల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహాన్ని, అసంతృప్తిని ఏ మాత్రం దాచుకోలేకపోతున్నారు. పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న విధంగానే ముస్లింలు మెజారిటీగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం కశ్మీర్ పట్ల కూడా భారత్ అదే పద్ధతిని అనుసరిస్తోందని ఇమ్రాన్ ఇటీవలే ఆరోపించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మల్లే ఇప్పుడు కశ్మీర్ కూడా భారత్‌లో ఒక ప్రాదేశిక ప్రాంతంగా మారిపోయిందని ఇమ్రాన్‌కు ఎవరైనా గుర్తు చేస్తే బావుండు. ఇమ్రాన్ ఆందోళనను అలా పక్కనబెడితే, భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు రానురానూ పురోగమిస్తున్నాయి. అనేక యుద్ధాల్లో, సంక్షోభ సమయాల్లో ఇజ్రాయెల్ తోడ్పాటు భారత్‌కు ఎంతో మేలు చేసింది. మన దేశం పట్ల ఇజ్రాయెల్ స్నేహభావానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం. కానీ, మన దాయాదికి ఈ స్నేహబంధం గిట్టడం లేదు.
భారతదేశం, ఇజ్రాయెల్ మధ్య బలపడుతున్న సంబంధాలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌లో నిస్పృహ కొనసాగుతోంది. భారత్, ఇజ్రాయెల్ మధ్య సౌహార్ద్ర సంబంధాలపట్ల ఖాన్ ఆగ్రహం దాచుకోలేకపోతున్నారు. పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న విధంగానే ముస్లింల మెజారిటీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం కశ్మీర్ పట్ల కూడా భారత్ అదే పద్ధతిని అనుసరిస్తోందని ఇమ్రాన్ ఇటీవలే ఆరోపించారు. కశ్మీర్ జనాభాను క్లిష్టాంశంగా మార్చి అక్కడ స్థానికుల అసంతృప్తిని పట్టాలు తప్పించాలని భారత్ కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే కశ్మీర్‌లో కశ్మీరేతరులను తిరిగి స్థిరపర్చాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారన్న వాస్తవం ఇమ్రాన్‌ను తీవ్ర సంకట స్థితిలోకి నెట్టివేసింది.
దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మల్లే భారత్‌లో ఇప్పుడు కశ్మీర్ కూడా ఒక ప్రాంతంగా మారిపోయిందని ఇమ్రాన్ ఖాన్‌కు ఎవరైనా గుర్తు చేయాల్సి ఉంది. కశ్మీర్‌లో ఏం చేయాలన్నా చేయగలిగే స్వేచ్ఛ ఇప్పుడు భారత్ సొంతమైంది. అందుకే పాక్ నుంచి ఎలాంటి సలహా అయినా తీసుకోవలసిన అవసరం భారత్‌కు లేదన్న వాస్తవం పాక్ పాలకులకు పెద్ద అసౌకర్యంగా కనిపిస్తున్నట్లు ఉంది. కశ్మీర్ విషయాన్ని వదిలిపెట్టి ఇమ్రాన్‌ఖాన్ తన పని తాను చూసుకుంటే, అయన ఆరోగ్యం ఇంత వేగంగా దిగజారకపోవచ్చు.
ఇమ్రాన్ ఎంత ఎక్కువగా మాట్లాడితే, అంత ఎక్కువగా తనకు కనీస జ్ఞానం కూడా లేదనే వాస్తవం బయటపడుతుంది. భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ సందర్శించినప్పుడే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దయిపోయిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. అయితే ఇమ్రాన్ తన ప్రకటనలలోని వాస్తవాన్ని ముందుగా ఒకసారి తనిఖీ చేసుకోవడం ఉత్తమం. నిజానికి మోదీ 2017లో ఇజ్రాయెల్ సందర్శిం చగా, 2019లో మాత్రమే కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించారు. అంటే అడ్డగోలు జ్ఞానంతో పాక్ ప్రధాని అబద్ధాల రాయుడిగా తన్ను తాను నిరూపించుకుంటున్నారు. పైగా భారత్ సాధిస్తున్న విజ యాలు, పురోగతిని చూసి ఇమ్రాన్‌కి జెర్రులు పాకుతున్నట్లుంది.
కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా మాట్లాడుతూ భారత్ తల్చుకుంటే పాక్ క్రికెట్‌ను సర్వనాశనం చేయగలదని చెప్పారు. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కి భారీగా నిధులు భారత్ నుంచే వస్తున్నాయి మరి. పీసీబీ అధ్యక్షుడిగా ఇమ్రాన్ ఖాన్ స్వయంగా నియమించిన వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. ఇలాంటి కారణాలతోటే ఇమ్రాన్ తీవ్ర నిస్పృహకు, ఆందోళనకు గురవుతున్నారని అనిపిస్తుంది.
ఇమ్రాన్ ఆందోళనను అలా పక్కనబెడితే, భారత్–ఇజ్రాయెల్ సంబంధాలు రానురాను పురోగతి చెందుతున్నాయి. పరస్పర అవగాహన, ప్రగాఢ విశ్వాసం ప్రాతిపదికనే రెండు దేశాల మధ్య సహకార సంబంధాలు ఏర్పడ్డాయి. అందుకే అవి శిలాసదృశంగా కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ పూర్వ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుల నాయకత్వంలో భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు మరింత సంఘటితమయ్యాయని మర్చిపోవద్దు. సంక్షోభ సమయాల్లో భారత్‌కు నిజమైన స్నేహితురాలిగా ఇజ్రాయెల్ నిలిచింది. మరోవైపున పాలస్తీనా అంశంపై అరబ్ ప్రపంచాన్ని భారత్ గుడ్డిగా బలపరపర్చింది. కానీ ఆ దేశాలనుంచి భారత్ తగిన సహకారం పొందలేదు. దానికి భిన్నంగా కశ్మీర్ అంశంపై ప్రతి సందర్భంలోనూ అరబ్ దేశాలు పాకిస్తాన్‌నే బలపర్చాయి. వీటితో పోలిస్తే ఇజ్రాయెల్ అన్ని సందర్భాల్లోనూ భారత్‌కు సహకారమందించింది.
భారత్‌లో కూడా కొన్ని శక్తులు ఇజ్రాయెల్‌ని బహిరంగంగా వ్యతి రేకిస్తున్నాయి. సంక్షోభ సమయాల్లో ఇజ్రాయెల్ ఎల్లప్పుడూ భారత్‌కి అండగా నిలిచిందనే విషయాన్ని వీరు మర్చిపోయారు. ఉదాహరణకు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీని తీసుకోండి. కోవిడ్ –19 మహమ్మారి విజృంభించటానికి ముందే ఈ వర్సిటీ విద్యార్థులు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు.
జామియా వర్సిటీలో ఇజ్రాయెల్ భాగస్వామ్యం ఉండకూడదని వారు డిమాండ్ చేశారు. పాలస్తీనాలో మానవహక్కులకు ఇజ్రాయెల్ తీవ్రంగా భంగం కలిగిస్తోందని వీరు ఆరోపించారు. అలాంటి శక్తులపై భారత్ చర్య తీసుకోవాలని వీరి డిమాండ్. పాక్ మాత్రమే కాదు, అరబ్ ప్రపంచం మొత్తంగా ఇజ్రాయెల్‌ని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు కొన్ని అంశాలు మెరుగైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరి మనస్సుల్లో ఇజ్రాయెల్ పట్ల ఈనాటికి ప్రతికూల ముద్ర బలంగా ఉంటోంది.
నిజానికి, ఇజ్రాయెల్, దాని పొరుగుదేశాల మధ్య 1967లోనే యుద్ధం చెలరేగింది. ఇది అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంగా పేరుకెక్కింది కూడా. ఈ యుద్ధంలో అరబ్ దేశాల తరపున పాక్ యుద్ధవిమానాలు కూడా పోరాడాయి. 1967 జూన్ 5, జూన్ 11 వరకు ఈ యుద్ధం కొనసాగింది. ఈ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా ముఖచిత్రం మారి పోయింది. గాజా నుంచి ఈజిప్టును, గోలాన్ హిల్స్ నుంచి సిరియాను ఇజ్రాయెల్ వెనక్కు నెట్టింది. అలాగే వెస్ట్ బ్యాంక్ నుంచి తూర్పు జెరూసలేం నుంచి జోర్డాన్‌ని కూడా పారదోలింది. పాక్ యుద్ధవిమానాలు ప్రత్యక్షంగా పాలుపంచుకున్నప్పటికీ ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపు సాధించింది.
పాక్ విదేశీ విధానం భారతదేశంతోపాటు ఇజ్రాయెల్‌ని కూడా శత్రుదేశంగా పరిగణిస్తుంటుంది. ఇజ్రాయెల్‌ని ఇంతవరకు గుర్తించని పాక్, ఆ దేశంతో కనీసం సంబంధాలు ఏర్పర్చుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇజ్రాయెల్ తప్ప మరే దేశాన్ని సందర్శించడానికైనా తన పౌరులకు అనుమతిస్తున్నట్లు పాకిస్తాన్ పాస్‌పోర్ట్ స్పష్టంగా ప్రకటిస్తోంది. మరోవైపున, మత ప్రాతిపదికన పాలస్తీనాను పాకిస్తాన్ గుర్తిస్తున్నందున ఇజ్రాయెల్ కూడా పాక్‌ను గుర్తించడం లేదు. భారత్, పాకిస్తాన్ మధ్య విషాదకరమైన సంబంధాలకు ఎన్నో కారణాలు తోడవుతున్నాయి.
పాకిస్తాన్ ఎలాంటి సభ్యతా లేని క్షుద్ర దేశం. భారత్ పట్ల ద్వేషభావంతోనే పాకిస్తాన్ ఏర్పడింది. ఉత్తర కొరియాకు అణ్వాయుధ సాంకేతిక జ్ఞానాన్ని అక్రమంగా, మోసపూరితంగా అమ్మిన వ్యక్తిని పాకిస్తాన్‌లో హీరోగా కొనియాడుతుంటారు. ఇస్లామిక్ అణుబాంబు పితామహుడిగా పేరొందిన దుష్ట శాస్త్రజ్ఞుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్‌ను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఇటీవలే మరణిం చారు. తన జీవితంలోని చివరి 17 సంవత్సరాలు పాక్‌లో బందీగానే గడిపారు. మరణించాక అతడిని ఒక హీరోని చేసి పడేశారు. తన విడుదల కోసం ప్రాధేయపడుతూనే ఆయన మరణించారు.
అబ్దుల్ ఖదీర్ భారత్‌లోని భోపాల్‌లో జన్మించారు. జీవిత పర్యం తమూ హిందువులను ద్వేషిస్తూ వచ్చారు. భారత్ మిస్సైల్ మ్యాన్, పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో పోలిస్తే ఏక్యూ ఖాన్ అప్రతిష్ట పాలయ్యారు. అగ్ని, పృథ్వీ వంటి సాటిలేని క్షిపణులు, అణు బాంబులతో భారత్‌ని సిద్ధం చేసిన కలాంని దేశ రాష్ట్రపతిగా ఎన్నుకుని గౌరవించుకున్నాం. భారత ప్రజల రాష్ట్రపతిగా ఆయన తనను తాను నిరూపించుకున్నారు. కానీ, కలాం ప్రతిష్టను చూసి ఏక్యూ ఖాన్ అసూయ చెందారు. కలాం ఒక సాధారణ శాస్త్రజ్ఞుడు అని ఒక ఇంటర్వ్యూలో కొట్టిపడేశారు. పాక్ ‘హీరో’లు ఎంత హృదయం లేని వారు అనేది మనం ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం.
ఇవన్నీ పక్కన బెడితే, భారత్, ఇజ్రాయెల్ సంబంధాల పట్ల ఇమ్రాన్‌ఖాన్ ఇప్పటికీ ఎందుకింత ద్వేషంతో ఉంటున్నాడన్నదే ప్రధానాంశం. గౌరవనీయమైన విలువలు, సమానతా ప్రాతిపదికన భారత్, ఇజ్రాయెల్ సంబంధాలు కొనసాగుతుండటాన్ని గుడ్డిగా తిరస్కరిం చడం తప్ప ఇమ్రాన్‌ఖాన్‌కు మరొక అవకాశం లేదు. అనేక యుద్ధాల్లో ఇజ్రాయెల్ సహాయం భారత్‌కు ఎంతో మేలు చేసింది. మన దేశం పట్ల ఇజ్రాయెల్ స్నేహభావానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం.
-ఆర్. కె. సిన్హా
వ్యాసకర్త సీనియర్ ఎడిటర్, రాజ్యసభ మాజీ ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment