
గమ్యం అదే అయినా గమనం ఎలా సాగింది? లక్ష్యం అదే అయినా పయనించిన దారులు ఏమిటి? చేరుకున్న తీరాలేమిటి? ఆయా నేతల వ్యక్తిత్వాలు, దృక్కోణాలు, పాటించిన విలు వలు, అవి తెలుగు జన జీవితాలపై, అభివృద్ధిపై వేసిన ముద్రలు ఏమిటి? విశాల ప్రజా హితానికి ఒనగూర్చిన ప్రయోజనాలేమిటి? చివ రకు చిట్టాలో మిగిలిందేమిటి? నిగ్గు తేలిన నిజా లేమిటి?
జగమెరిగిన జర్నలిస్టు, పొలిటికల్ ఎనలిస్టు దేవులపల్లి అమర్... ఐదు దశాబ్దాల పాత్రికేయ అనుభవంతో, తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక పరిణామాల ప్రత్యక్ష సాక్షిగా అనేకా నేక విషయాలను క్రోడీకరించుకుని వ్యయ ప్రయాసలతో వెలువరించిన పుస్తకం ‘మూడు దారులు’. రాజకీయ రణరంగాన భిన్న ధ్రువాలు అనేది ఉపశీర్షిక.
ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిత్వాల వ్యత్యాసాలనూ, వారు అనుసరించిన రాజకీయ మార్గాన్నీ సమగ్రంగా, ఆసక్తి దాయకంగా విశ్లేషించారు. ‘ది దక్కన్ పవర్ ప్లే’ పేరిట ఇంగ్లీషులోనూ ఇదే పుస్తకాన్ని వెలువరించారు. సమకాలిక రాజకీయ చరిత్రలోని వక్రీకర ణల వంకర్లను సరిచేసి భావితరాలకూ, దేశ ప్రజానీకానికీ వాస్తవాలను అందించేందుకు ఈ పుస్తకంలో గట్టి ప్రయత్నమే చేశారు అమర్.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు 1978లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఒకే రోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత వైఎస్ పూర్తిగా కాంగ్రెస్‌కే అంకితమై తన నాయ కత్వ సామర్థ్యంతో పార్టీని ముందుకు నడిపించి రాష్ట్ర సారథి అయ్యారు. ‘మాట తప్పడు, మడమ తిప్పడు’ అనే పేరూ పొందారు. సంక్షేమ పథకాల అమలులోనూ కొత్త పుంతలు తొక్కి ‘రాజన్న రాజ్యం’ అనే చెరగని ముద్ర వేయ గలిగారు. వై.ఎస్. చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ఆయన ఆలోచనలనూ, వ్యవహార సరళినీ పూర్తిగా మార్చేసింది.
మరోవైపు చంద్రబాబు నాయుడు రాజ కీయ జీవితం పూర్తిగా భిన్నమైనది. తనకు రాజ కీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి, మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి, చివరకు ఆ మామనే వెన్నుపోటు పొడిచి అధికారం హస్త గతం చేసుకున్న ఘన చరిత్ర ఆయనకే సొంతం. ఏ దశలోనూ తన బలంతో కాకుండా, పరాన్న జీవిలా ఇతర పార్టీల పొత్తులతో, జిత్తులతో నెట్టుకొస్తున్న ట్రాక్ రికార్డు చంద్రబాబుది.
ఆయన ఏమిటో అమర్ ఇలా చెప్తారు: ‘జిత్తుల మారి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. రాజకీయ సోపాన పటంలో పైకి పాకేందుకు ఆయన ఎంచుకున్న దారి ఇదే. తన ఎదు గుదలకు అడ్డువచ్చే వారిని సహించలేకపోవడం ఆయన బలహీనత. బంధువులైనా, స్నేహితు లైనా సామదాన భేదోపాయాలతో వారిని తన దారి నుంచి తప్పించగల రాజకీయ చతురత ఆయన సొంతం. ఆది నుంచి ఆయన అవ కాశవాద రాజకీయాల ఆసరాతోనే ఎదిగారన్నది సుస్పష్టం’.
వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు నడిపిన వెన్నుపోటు కుట్రలను ఎంతో భావో ద్విగ్నంగా, ‘ఆ తొమ్మిది రోజుల్లో ఏం జరిగింది?’ అనే అధ్యాయంలో అమర్ పొందు పరిచారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నిష్క్రియా పరత్వం, ముప్పు ముంచు కొస్తున్నా పసిగట్ట లేకపోవడం గురించి కూడా వివరంగా రాశారు.
చంద్రబాబును దొడ్డిదారిన అధికారంలోకి తేవడంలో ఎంతో మంది పత్రికాధిపతులు, ఎడి టర్లు పోషించిన పాత్రను కూడా నీళ్లు నమలకుండా చెప్పారు. అప్పట్లో ‘ఆంధ్రప్రభ’లో బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. జరిగింది జరిగినట్లుగా నివేదించేందుకు తన ఎడిటర్లను కన్విన్స్ చేయ డానికి అమర్ చేయని ప్రయత్నం లేదు. కానీ, అమర్ హిత బోధలను కీలక స్థానాల్లో ఉన్నవారు పెడచెవిన పెట్టడంతో ఉద్యోగ ధర్మంగా సర్దుకపోక తప్పని పరిస్థితులు.
ఆ తదనంతర కాలంలో వైఎస్ ఆకస్మిక మరణంతో అనివార్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎవరికీ తలవంచక, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి
సొంతదారి నిర్మించుకున్నారు. తన తండ్రి వైఎస్ ఆశయాలూ, లక్ష్యాల బాటలోనే నడుస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరు గులు తీయిస్తూ తండ్రికి మించిన తనయుడ నిపించుకుంటున్నారు.
తెలుగువారి సమకాలిక రాజకీయ చరిత్ర లోని అసలు కోణాలనూ, వాస్తవాలనూ తెలుసు కోవాలన్న జిజ్ఞాస ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది.
– గోవిందరాజు చక్రధర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్