బుద్ధదేవ్ భట్టాచార్య
1988 మార్చిలో రాజ్య సభకు ఎన్నికయ్యాను. అప్పటికి ఒక మాసం ముందు త్రిపుర శాసన సభకు జరిగిన ఎన్నిక లలో, అప్పటికి పదే ళ్ళుగా అధికారంలో ఉన్న నృపేన్ చక్రవర్తిని ఓడించి, కాంగ్రెస్‌కు చెందిన సుధీర్ రంజన్ మజుందార్ ప్రభుత్వం కొలువు తీరింది. ప్రతిపక్షాలకు చెందిన కార్య కర్తలపై దాడులు, వారి ఆస్థులను ధ్వంసం చేయడం, ఇళ్ళను తగులబెట్టడం వంటి దుర్మా ర్గాలు చోటు చేసుకున్నాయి. పార్లమెంట్ నుండి ఒక అఖిలపక్షం ఆ రాష్ట్రంలో పర్యటించి, వారికి ధైర్యం చెప్పి, సాంత్వన కల్పించాలని మా సభలో మా సహచరులు దిపేన్ ఘోష్, సుకుమార్ సేన్, సురేన్ భట్టా చారి, గురుదాస్ దాస్ గుప్తా కోరారు. తెలుగు దేశం నుండి శివాజీ రావాలని కోరారు. సరేనన్నాను.
శుక్రవారం సాయంత్రం రాజ్యసభ సమా వేశాలు ముగిసినాక, సాయంత్రం బయలుదేరి కలకత్తా చేరుకొన్నాం. విమానాశ్రయంలో బెంగాల్‌కు చెందిన మార్క్సిస్టు పార్టీ నాయకులు మాకు స్వాగతం పలికి, విమానాశ్రయంలోని విశ్రాంతి గదులలో ఏర్పాటు చేసిన బసలో మమ్మల్ని దించారు. అదే సమయంలో ఢిల్లీ వెళ్ళడానికి విమానాశ్రయానికి వచ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు మమ్ములను పరి చయం చేసి, కాసేపు ముచ్చటించే ఏర్పాటు చేశారు. మరురోజు ఉదయం అగర్తలాకు విమా నంలో వెళ్లాము. మాతోపాటు బెంగాల్ మంత్రులు కూడా మూడు రోజులు పర్యటించారు. ఒక నివేదిక తయారు చేశాం. అదంతా రాజ్యసభలో ప్రస్తావించాం. ఆ కథ అంతటితో ముగిసింది.
తరువాత పుష్కర కాలం గడిచినాక 2000 నవంబరులో జ్యోతిబసు తరువాత బుద్ధదేవ్ ముఖ్యమంత్రిగా – పదకొండు సంవత్సరాలు ఆదర్శవంతమైన, విశుద్ధ పరిపాలన అందించారు. మాతో సామాన్య కార్యకర్త మాదిరి సిగరెట్లు కాలుస్తూ, చేతిలో ఆంగ్ల నవల పట్టుకొని సంచరించిన బుద్ధదేవ్, ముఖ్యమంత్రిగా అధికార నివాసానికి మారకుండా, తానుండే సాదా–సీదా రెండు పడక గదుల ఆపార్టుమెంటులోనే కొనసాగారు. సాయంత్రం 5 గంటల కల్లా రైటర్స్ భవన్ నుండి బయటకొచ్చి, తోవలో పార్టీ కార్యాలయంలో కాసేపుండేవారు. ఇంటికొచ్చి పచ్చి వక్కను కత్తిరించుకొని నములుతూ, ఇంగ్లిష్ నవలను ఆస్వాదిస్తూ, టుంగుటుయ్యాలలో కూర్చుని సేదదీరేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వారి శ్రీమతి ఒక పాఠ శాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ట్రాం మీద ప్రయాణం చేసేవారు. ప్రతిరోజూ ఇంటివద్ద ఎవరినీ, సందర్శకులకు అనుమతించేది లేదు. ఎవరైనా ఆఫీసులో కలుసుకోవాల్సిందే.
ఆగస్టు 8న మరణించిన బుద్ధదేవ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ, కొత్తగా రాజకీయాలలోకి అడుగు పెడుతున్న యువతరం వారిని ఆదర్శంగా తీసు కోవాలని ఆకాంక్షి స్తున్నాను. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త, రాజ్యసభ మాజీ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment