కేంద్ర మంత్రి పెమ్మసాని
మంగళగిరి (తాడేపల్లి రూరల్): తపాలా శాఖను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. కుంచనపల్లి, యర్రబాలెంలో ఉన్న తపాలా కార్యాలయాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖల ఆదాయం ఎలా పెంచాలో ఉద్యోగులకు వివరించారు. కాస్ట్ సెంటర్ నుంచి ప్రాఫిట్ సెంటర్‌గా ఎలా చేయాలనే అంశంపై పరిశీలన చేసినట్లు పేర్కొన్నారు. గ్రౌండ్ రియాల్టీ తెలుసుకునేందుకు ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించామన్నారు. ఉద్యోగుల జీతాలు, ఇన్సెంటివ్‌లు సకాలంలో అందుతున్నాయో లేవో అడిగి తెలుసుకున్నారు. తపాలా శాఖకు ప్రస్తుతం రూ.13 వేల కోట్ల ఆదాయం ఉంటే ఖర్చులు రూ.35 వేల కోట్లు ఉన్నాయని, ఈ క్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి తపాలాశాఖ ఉన్నతికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తపాలా శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీపీఎంజీ కె.ప్రకాష్, పోస్ట్‌మాస్టర్ జనరల్ డీఎస్వీ ఆర్.మూర్తి, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ యలమందయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment