ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Published Fri, Jun 14 2024 1:14 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

కాశిబుగ్గ: ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం మంత్రి వరంగల్‌ ఓ సిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి కొన్ని సమస్యలపై అప్పటికప్పుడు ఆధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎలక్షన్‌ కోడ్‌ కారణంగా ప్రజలను కలవలేకపోయానని ఇక నుంచి అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. ఏసమస్యలున్నా.. తనని నేరుగా వచ్చి సంప్రదించాలని సూచించారు. మంత్రి క్యాంపు కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అనేక మంది సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. 35వ డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేణుకుంట్ల శివకుమార్‌ శివనగర్‌ ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించాలంటూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఎన్నో సమస్యలను మంత్రి సంబంధిత అధికారులకు ఫొన్‌ చేసి పరిష్కరించాలని సూచించారు.

రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

ఓ సిటీ క్యాంపు కార్యాలయంలో

వినతుల స్వీకరణ

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement