
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరటంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి జీవన్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి వారితో జీవన్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం, తనకు సమాచారం లేకుండానే ఇదంతా జరగిందంటూ టి. జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు సిద్ధపడ్డారు. అటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన్ను కాంగ్రెస్ నేతలు, మంత్రలు బుజ్జగించారు. జీవన్‌రెడ్డితో కాంగ్రెస్ హైకమాండ్ సైతం చర్చలు జరుపుతోందని, ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీ బయలుదేరటంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment