సాటి వారికి ఉపయోగపడాలనేవారు.. - | Sakshi
Sakshi News home page

సాటి వారికి ఉపయోగపడాలనేవారు..

Published Sun, Jun 16 2024 1:20 AM

సాటి

నాన్నే నా హీరో.. ఆయన తీరు ఆదర్శం

మహబూబాబాద్‌ ఎస్పీ సుధీర్‌ రాంనాఽథ్‌ కేకన్‌

సాక్షి, మహబూబాబాద్‌ : మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న ఇరిగేషన్‌ శాఖలో చిన్న ఉద్యోగి. అయినా ఆయ న ఆలోచనలు పెద్దగా ఉండేవి. ఎవరు ఎన్ని చెప్పినా పిల్లలను బాగా చదివించాలన్నదే ఆయ న లక్ష్యం. అదే దిశగా నాతోపాటు ముగ్గురు అన్నలను పెంచారు. ఏ పనిచేసినా.. ఉద్యోగం చేసినా.. సాటివారికి ఉపయోగపడాలి, విలువలతో కూడిన జీవితం గడపాలన్నదే ఆయన ఆలోచన. ఆ విషయాలే ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ యన ఆఫీసుకు వచ్చిన పెద్ద ఆఫీసర్లు, వారు ప్రజలకు, ఉద్యోగులకు చేస్తున్న మేలు వివరించేవారు. ఎక్కువ మందికి ఉపయోగపడాలి. సాయం చేయాలంటే పెద్ద ఉద్యోగాలు సాధించాలనేవారు. అందుకోసం కష్టపడా లి అని చెప్పి చదివించేవారు. ఆయన మాటలే నన్ను ఐపీఎస్‌ చదివేలా చేశాయి. నాకు ఐపీఎస్‌ వచ్చిన వార్త వినగానే నాన్న కళ్లల్లో ఆనందబాష్పాలు.. కుటుంబ సభ్యుల సంతోషం.. ఇప్పటికీ గుర్తుకొస్తాయి. కష్టంవిలువ తెలిపిన మా నాన్న రాంనాథ్‌ కేకన్‌ నా నిజమైన హీరో.. ఆయనే నాకు స్ఫూర్తి.. ఆదర్శం..ఆచరణ.

నాన్న ప్రోత్సాహంతో

ముందుకెళ్తున్నా..

పాలకుర్తి: నా జీవిత ప్రయాణంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్న హైదరాబాద్‌లో బీటెక్‌ వరకు చదివించారు. వివాహం తర్వాత అమెరికాలో మేనేజర్‌గా పనిచేశా. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇందులో మా నాన్న మామిడాల తిరుపతిరెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొన్నా. ఘన విజయం సాధించా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.

– మామిడాల యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి

సాటి వారికి  ఉపయోగపడాలనేవారు..
1/1

సాటి వారికి ఉపయోగపడాలనేవారు..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement