ప్రతీక్షణం నా వెనుకాలే.. - | Sakshi
Sakshi News home page

ప్రతీక్షణం నా వెనుకాలే..

Published Sun, Jun 16 2024 1:20 AM

ప్రతీక్షణం నా వెనుకాలే..

రాజకీయ అరంగేట్రం చేస్తున్న సమయంలో నాన్న ప్రతీక్షణం నా వెనుకాలే ఉన్నారు. ఎంపీ టికెట్‌ వచ్చిన మొదలు గెలిచే వరకు ఒకటీ, రెండు మీటింగులు తప్పితే అత్యధిక సమావేశాలు, సభలకు నాన్న నా వెంటే ఉంటూ నా వెన్నెముఖలా నిలిచారు. సభల్లో ఎలా మాట్లాడాలి.. ఏయే అంశాలు ప్రస్తావించాలి.. మొదలు ప్రతిదీ చిన్నపిల్లలకు మాదిరిగా చెప్పేవారు. మడికొండలో సీఎం రేవంత్‌రెడ్డి సభలో ప్రసంగించే సమయంలో నాన్న ఉన్నాడన్న ధైర్యమే నన్ను నిలబెట్టింది.

ఎన్నికల ప్రచారంలో తండ్రి శ్రీహరితో

కూతురు కావ్య (ఫైల్‌)

ప్రజాప్రతినిధి హోదా ఉంటే ప్రజలకు, సామాజిక సేవ మరింత ఎక్కువ చేయొచ్చని అనిపించింది. ఈ విషయాన్ని 2016లో నాన్న డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు నాన్న రాజకీయాలంటే అంత సులువు కాదు.. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా అని సర్దిచెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇందులో సమయస్ఫూర్తి, ఓర్పు ఉండాలని పదే పదే చెబుతుంటారు.

సమయం వచ్చినప్పుడు చెబుతా అన్నారు..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement