మెనూ ప్రకారం భోజనం అందించాలి
హన్మకొండ అర్బన్: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మెనూ ప్రకారం భోజనం అందించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో అందించే భోజనం అమలు తీరు, ఫుడ్ సేఫ్టీపై అధికారులు, ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్న కాంట్రక్టర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆహార పదార్థాలు, కూరగాయలు నాణ్యత లేకపోతే తిరిగి పంపించాలని చెప్పారు. విద్యార్థులకు మెనూ ప్రకారం.. అందించే భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే నోటీసులివ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిరంతరం పరిశీలించాలని అదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఈఓ వాసంతి, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జిల్లా పౌర సరఫరాల అధికారి కొమరయ్య, పౌరసరఫరాల శాఖ మేనేజర్ మహేందర్, ఆర్అండ్బీ ఈఈ సురేశ్‌బాబు, వివిధ విద్యాసంస్థల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ
కరదీపిక, కరపత్రం ఆవిష్కరణ
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన కరదీపికను కలెక్టర్ పి.ప్రావీణ్య సోమవారం ఆవిష్కరించారు. ఈ కరదీపిక వైద్యాధికారులకు చాలా ఉపయోకరంగా ఉంటుందని, ప్లానింగ్, సిబ్బందికి శిక్షణ అందించేందుకు ఉపయోగపడుందన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు నారాయణ, రమేశ్, డీఈఓ వాసంతి, జిల్లా సంక్షేమాధికారి జయంతి తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
అధికారులు,
ఫుడ్ సప్లయర్స్‌తో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment