హైదరాబాద్: కుటుంబ సమస్యలతో క్షణికావేశంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ ప్రాంతానికి చెందిన దండు సాయికిరణ్ రెడ్డి (23), మంచిర్యాల ప్రాంతానికి శ్రియారెడ్డిలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీరు సంవత్సరంన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం కొద్దిరోజులకు ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవ జరిగినప్పుడల్లా భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు సూసైడ్ చేసుకుంటామంటూ బెదిరించుకునే వారు.
కాగా శనివారం ఇద్దరికి సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నారు. షాపింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సాయికిరణ్ భార్య సమక్షంలోనే గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు. బెదిరించడానికే అనుకున్న భార్య చాలా సేపు వరకు అతన్ని పలకరించలేదు. చివరకు అనుమానం వచ్చి తలుపు తట్టింది.
ఎంత సేపటికి తలుపు తెరవక పోవడంతో మామ జంగారెడ్డి, స్థానికుల సహాయంతో తలుపులు బలవంతగా తెరిచి చూడగా..ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. వెంటనే కిందకు దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్ట్రం నిమిత్తం గాంధీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment