హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. ఆదివారం కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన 55 మందితో కూడిన మొదటి జాబితాలో నగరంలో 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీ సీట్ల రగడ హాట్‌టాపిక్‌గా మారిన నేపథ్యంలో తొలి జాబితాలో మహానగర పరిధిలో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట లభించింది. మొత్తం మీద తొమ్మిది మంది బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు, ఐదుగురు ఓసీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది.
ఉప కులాల వారీగా పరిశీలిస్తే.. ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి, వెలమ, బ్రాహ్మణ ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన ఒక్కొక్కరికి అవకాశం లభించింది. అదేవిధంగా బీసీ కేటగిరీలో యాదవ, ముస్లిం సామాజిక వర్గాలకు రెండు స్థానాల్లో, ముదిరాజ్, మున్నూరుకాపు, వాల్మీకి, మేరు, వంజర సామాజిక వర్గాలకు చెందిన వారికి ఒక్కో స్థానాల్లో అవకాశం కల్పించారు. దసరా తర్వాత ప్రకటించే రెండో జాబితాలో మిగిలిన పది స్థానాలకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఖరారైన అభ్యర్థులు వీరే..
అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసేందుకు కాంగ్రెస్ తొలి జాబితాలో మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ (నాంపల్లి), అంజన్‌కుమార్ యాదవ్ (ముషీరాబాద్), డాక్టర్ కోట నీలిమ (సనత్‌నగర్), మొగిలి సునీత (గోషామహల్), తోటకూర వజ్రేష్ యాదవ్ (మేడ్చల్), మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి), ఎం. పరమేశ్వర్ రెడ్డి (ఉప్పల్), కొలన్ హన్మంత్ రెడ్డి (కుత్బుల్లాపూర్), ఆదం సంతోష్ కుమార్ (సికింద్రాబాద్), షేక్ అక్బర్ (మలక్‌పేట), ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ (కార్వాన్ ), బోయ నగేష్ (చాంద్రాయణగుట్ట), కె.రవిరాజు (యాకుత్‌పురా), పులిపాటి రాజేష్ కుమార్ (బహదూర్‌పురా) అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment