హైదరాబాద్: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన వ్యక్తిపై చికాగో నగరంలో కొందరు వ్యక్తులు దాడి చేసి మొబైల్ ఫోన్, డబ్బులు లాక్కెళ్లారు. వివరాల్లోకి వెళితే.... లంగర్‌హౌస్ హాషం నగర్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీ చికాగోలో క్యాంప్‌బెల్ ఏవ్‌లో ఉంటూ వెస్లీ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు.ఈ నెల 4న రాత్రి అతను ఇంట్లోకి వెళుతుండగా అదే సమయంలో తుపాకులతో అపార్టుమెంట్ వద్దకు వచ్చిన నలుగురు దుండగులు అతడిపై దాడి చేసి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్, నగదు లాక్కుని పారిపోయారు.
దీనిపై సమాచారం అందడంతో అతడి భార్య కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌ను కలిసి ఈ విషయమై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. తన భర్తకు వైద్యం చేయించి తక్షణ వీసా ఇప్పించి దేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఆమె భర్తకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి మెయిల్ ద్వారా తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment