![ఆటో డ్రైవర్ల సమస్యలపై వెంటనే స్పందించాలి](/styles/webp/s3/article_images/2024/11/15/14amb33-160008_mr-1731636262-0.jpg.webp?itok=4A_dyxiw)
ఆటో డ్రైవర్ల సమస్యలపై వెంటనే స్పందించాలి
కాచిగూడ: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలపై ఉదాసీన వైఖరి ప్రదర్శించడం దారుణమని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేత బి.వెంకటేశం అన్నారు. గురువారం నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, మహాలక్ష్మి పథకం వల్ల ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 వేల కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని, ఆటోలకు థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించాలని అన్నారు. ఈ నెల 21వ తేదీన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎ.బిక్షపతి (ఎఐటియుసి), కె.అజయ్‌బాబు (సిఐటియు), జి.లింగంగౌడ్ (టియుసిఐ), ఎంఏ సలీమ్, షేక్ నజీర్ (యుటిఎడిడబ్ల్యూఏ), ఎ.సత్తిరెడ్డి (టిఏడిఎస్), ఎస్.రాంకిషన్ (బిఆర్‌టియు) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment