మ్యాన్‌హోల్.. క్లీనింగ్ రోబో
మద్రాస్ ఐఐటీ రూపొందించిన ‘హోమ్‌సెప్ సీవర్’
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఇకపై మ్యాన్‌హోళ్ల క్లీనింగ్‌ను రోబో సాయంతోనే చేయనున్నారు. ఐఐటీ మద్రాస్ సౌజన్యంతో రూపొందించిన ‘హోమ్‌సెప్ సీవర్’ రోబో ద్వారా మ్యాన్‌హోల్స్ క్లీనింగ్‌కు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన సోలినాస్ ఇంటెగ్రిటీ ప్రైవేట్ లిమిటెడ్, వెల్స్ ఫార్‌గో సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) కింద రూ.60 లక్షల విలువైన ఈ రోబోను సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఉచితంగా అందజేశారు. కంటోన్మెంట్ అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎన్‌వీ నంజుండేశ్వర.. సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు సభ్యుడు రామకృష్ణలతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం సోలినాస్ సంస్థ ప్రతినిధులు ఈ రోబో పని తీరును కంటోన్మెంట్ సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ సూపరింటెండెంట్‌లు రాజ్‌కుమార్, దేవేందర్, మహేందర్, ఇంజినీర్‌లు పి. సావన్ కుమార్, సోలినాస్ సంస్థకు చెందిన నితీష్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకతలు ఇవీ..
● వీల్స్, టైర్‌లతో కూడిన ఈ రోబోను సీవరేజీ వాహనాలకు అనుసంధానం చేసి మ్యాన్‌హోల్స్ ఉన్న ప్రాంతాలకు సులభంగా తీసుకెళ్లవచ్చు.
● బ్లేడ్, బకెట్ సక్షన్‌లతో కూడిన ఈ రోబో తానే స్వయంగా మ్యాన్‌హోల్ మూతలను తొలగించి అందులోకి ప్రవేశిస్తుంది.
● క్విక్ బ్లేడ్ బకెట్ సిస్టమ్, రొటేటింగ్ మోటార్‌లు, స్లయిడింగ్ యాక్చువేటర్స్ ద్వారా మ్యాన్‌హోల్ లోపల సులభంగా ప్రయాణిస్తుంది.
● జీపీఎస్ ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారా మ్యాన్‌హోల్ లోపల ఎంత లోతుకు, దూరం వెళ్లింది తెలుసుకోవచ్చు.
● ఈ రోబోలో మ్తొతం 4 ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మూడు నైట్ విజన్‌తో పనిచేస్తాయి. 170 డిగ్రీల కోణంలో ఫొటోలు, వీడియోలు తీస్తాయి. మరొకటి అండర్ వాటర్ కెమెరా.
● రోబో కెమెరాల్లో నిక్షిప్తం చేసిన ఫొటోలు, వీడియోలను హై రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే ద్వారా గమనించవచ్చు. ఆయా కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజీని నెల రోజుల వరకు స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంది.
● రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే రోబో మ్యాన్‌హోల్‌లోని చెత్తను సేకరించి, దానికి అనుసంధానం చేసిన స్టోరేజ్ బిన్‌లలోకి మారుస్తుంది.
● ఈ రోబోలో మరో ప్రత్యేకత ఏమిటంటే మ్యాన్‌హోల్ లోపల ఉన్న విషవాయువులను గుర్తిస్తుంది. మిథేన్, కార్బన్ మోనాకై ్సడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, నైట్రోజన్ డయాకై ్సడ్, ఈథెన్ వంటి వాయువుల గుర్తించడంతో పాటు గాఢతను సైతం బయట ఉన్న ఎల్‌సీడీ డిస్‌ప్లేలో చూపిస్తుంది.
● పెట్రోల్‌తో నడిచే ఈ రోబో నిరంతరాయంగా 8 గంటల పాటు పనిచేస్తుంది.
సీఎస్‌ఆర్ కింద కంటోన్మెంట్‌కు అందజేత
ప్రారంభించిన బోర్డు అధికారులు
రాష్ట్రంలోనే ఇది తొలి రోబో.. దీని విలువ రూ.60 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment