గంపెడు పిల్లలున్నా.. ఇంకో పిల్లను చంకనెత్తుకోవాలని.. | 10 Kids Mom is Happy for her Parenting Planning to have 11 th Baby | Sakshi
Sakshi News home page

10 Kids Mom: గంపెడు పిల్లలున్నా.. ఇంకో పిల్లను చంకనెత్తుకోవాలని..

Feb 11 2024 9:40 AM | Updated on Feb 11 2024 9:40 AM

10 Kids Mom is Happy for her Parenting Planning to have 11 th Baby - Sakshi

గత పదేళ్లుగా ప్రతీయేటా ఒక్కో బిడ్డకు జన్మనిస్తోంది ఆ తల్లి. అయినా ఆమెకు పిల్లలను కనాలనే ఆశ అలానే నిలిచి ఉంది. అందుకే ఇప్పుడు మరో బిడ్డను కనేందుకు సిద్ధమయ్యింది. గంపెడు పిల్లలతో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అమె కనిపించినవారందరికీ చెబుతోంది. వీరి ఫ్యామిలీకి ‘లాఫింగ్‌ ఫ్యామిలీ’ అనే ట్యాగ్‌ తగిలించారు. ఈ కుటుంబానికి సోషల్‌ మీడియాలో లెక్కలేనన్ని లైక్‌లు వస్తుంటాయి. 

2009 నుంచి పిల్లలను కనడమే పెద్ద పనిగా పెట్టుకున్న ఈమె ఇప్పుడు మరో బిడ్డను కనడానికి సిద్ధమవుతోంది. 40 ఏళ్ల క్యారిసా కాలిన్స్‌కు ముగ్గురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలు. ఈ అమెరికన్ తల్లికి టిక్‌టాక్‌లో 30 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈమె తరచూ తన జీవితానికి సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

క్యారిసా పిల్లల పేర్ల గురించి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరుగుతుంటుంది. క్యారిసా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండటం చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కొందరు అంటున్నారు. అయితే క్యారిసా కుటుంబం ఈ వ్యాఖ్యలను పట్టించుకోవడం ఎప్పుడో మానేసిందట. 

భర్త ఉద్యోగరీత్యా తరచూ ఇంటి బయట ఉండటంతో క్యారిసానే పిల్లల ఆలనాపాలనా, చదువుసంధ్యలను చూసుకుంటుంది. క్యారిసా పిల్లల పేర్లు అనిసా (14), ఆండ్రీ (13) అనిస్టన్ (11) ఏంజెలీ (10) అండర్సన్ (9), ఏంజెల్ (7) ఎన్సర్ (6) యాంకర్ (4) యాంథిమ్ (3) బేబీ ఆర్మర్. తన భర్త అద్భుతమైన తండ్రి అని క్యారిసా చెబుతుంటుంది. భర్త ఇంటికి వచ్చినప్పుడు పిల్లలందరితో కలసి ఆడుకుంటాడని తెలిపింది. కాగా క్యారిసా టిక్‌ టాక్‌ వీడియోలలోని కొన్నింటికి 55 లక్షలకు పైగా లైక్‌లు రావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement