జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు మనిషి టెక్నాలజీని వీలైనంత మేరకు వినియోగిస్తున్నాడు. తాజాగా ఇదే కోవలో మనిషి జీవితంలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రవేశించింది. దీనిని అందరూ ఒక అద్భుతంగా భావిస్తున్నారు. అయితే ఇంతలోనే ఏఐని అక్రమ కార్యకలాపాలకు వినియోగించడం కూడా మొదలయ్యింది. డీప్ ఫేక్ ఇమేజ్, వీడియో టూల్ మొదలైనవి ఆన్‌లైన్ మోసాలకు ఉపకరించేవిగా మారిపోయాయి. ఇటువంటి మోసం ఒకటి చైనాలో చోటుచేసుకుంది.
ఉత్తర చైనాకు చెందిన ఒక వ్యక్తి డీప్ ఫేక్ టెక్నిక్ ఉపయోగించి ఐదు కోట్లకుపైగా మొత్తాన్ని కొల్లగొట్టాడు. డీప్‌ఫేక్ అంటే ఫేక్ డిజిటల్ ఫొటో, దీని ఆధారంగా రూపొందించే వీడియో చూసేందుకు నిజమైనదిగానే కనిపిస్తుంది. దీని ఆధారంగా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే అవకాశం ఏర్పడుతుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఉత్తర చైనాకు చెందిన ఒక మోసగాడు డీప్ ఫేక్ టెక్నిక్ సాయంతో ఒక వ్యక్తి నుంచి తన ఖాతాలోకి కోట్లాది రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.
స్కామర్.. ఏఐ- వైఫై ఫేస్ స్వైపింగ్ టెక్నిక్ సాయంతో ఈ మోసానికి పాల్పడ్డాడు. బావోటా సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోసగాడు వీడియో కాల్‌లో స్నేహితునిగా మారి, అతని నుంచి 4.3 మిలియన్ల యువాన్లు(సుమారు రూ. 5 కోట్లు) ట్రాన్స్ ఫర్ చేయాలని కోరాడు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని నమ్మి, తాను డబ్బులు టాన్స్‌ఫర్ చేశానని తెలిపాడు. అయితే తన స్నేహితుడు అసలు విషయం చెప్పడంతో మోసపోయానని గ్రహించానన్నాడు. ఈ ఉదంతంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment