వాషింగ్టన్: అమెరికాలోని, పలు ఇతర దేశాల్లోని 100కి పైగా కంపెనీలు, సంస్థల వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేసి, సున్నితమైన, విలువైన సమాచారం తస్కరించారని ఆరోపిస్తూ ఐదుగురు చైనా పౌరులపై అమెరికా కేసు నమోదు చేసింది. వారు హ్యాక్ చేసిన వాటిలో భారత ప్రభుత్వ విభాగాలకు చెందిన పలు వెబ్‌సైట్లు ఉన్నాయి. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఆ చైనా పౌరులకు ఇద్దరు మలేసియన్లు సహకరించారని అమెరికా డెప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ రోజెన్ బుధవారం వెల్లడించారు. ‘భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ వీపీఎన్ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యేందుకు వారు వీపీఎస్ ప్రొవైడర్ సర్వర్లను ఉపయోగించుకున్నారు. భారత ప్రభుత్వ కంప్యూటర్లలో కోబాల్ట్ స్ట్రైక్ మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేశారు’ అని డెప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment