యూదు సంస్కృతిలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవితంలో వివాహమనేది తప్పనిసరిగా జరగాలని యూదులు భావిస్తారు. ఇతర మతాలలోని మాదిరిగానే వివాహాన్ని పవిత్ర బంధంతో కూడిన ఒప్పందంగా పరిగణిస్తారు. 18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో యూదుల మతం, సంస్కృతి పరిఢవిల్లింది. వివాహ ఆచారాలు కూడా ఏర్పడ్డాయి.
జుడాయిజంలో వివాహం అనేది ఒక పవిత్ర ఒప్పందం. దీనికి శుభ సమయం అంటూ ఉండదు. సాధారణంగా వివాహాలను ఆదివారం నిర్వహిస్తుంటారు. సన్నిహితుల సమక్షంలో వధువు- వరుడు తమ వివాహానికి సమ్మతి తెలియజేస్తారు. జీవితాంతం ఒకరికి ఒకరుగా కలిసి జీవిస్తామని వాగ్దానం చేస్తారు. యూదుల సంస్కృతిలో వివాహాన్ని కిద్దుషిన్ అంటారు.
వివాహ వేడుకకు ముందు యూదులు ఉంగరాన్ని ధరించే వేడుకను నిర్వహిస్తారు. దీనిని హిందూ, ఇతర మతాలలో నిశ్చితార్థం అని అంటారు. యూదులలో వివాహానికి ముందు వధూవరులు కలుసుకునే సంప్రదాయాన్ని ‘యోమ్ కిప్పూర్ విడ్డూయ్’ అని అంటారు. దీనిలో అబ్బాయి, అమ్మాయి కలుసుకుంటారు. ఒప్పుకోలు ప్రార్థనలో పాల్గొంటారు. గత జీవితంలోని అన్ని తప్పులకు క్షమించాలని పరస్పరం వేడుకుంటారు. ఒకరికొకరు నమ్మకంగా మెలుగుతామని ప్రమాణం చేస్తారు.
యూదుల వివాహాల్లో చుప్పా(వివాహ వేదిక)కు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. చుప్పాలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఆచారం ప్రకారం జరిగే తంతు ఉంటుంది. వధూవరులు ఏడు అడుగులు వేయడం అనేదాన్ని పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు. వరుడు.. వధువు కుడి చూపుడు వేలుకు ఉంగరాన్ని అలంకరిస్తాడు. తరువాత వధూవరులు అందరి సమక్షంలో తాము జీవితాంతం కలసి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాగే వధూవరుల వివాహ ఒప్పందాన్ని ఆహ్వానితుల సమక్షంలో చదువుతారు.
వేడుక ముగింపులో వరుడు ఒక గాజు గ్లానుసు పగలగొట్టి, దానిని తన కుడి పాదంతో చూర్ణం చేస్తాడు. ఈ సమయంలో అతిథులు ‘మజెల్ తోవ్’ అని అరుస్తారు. ఇది ఇది హీబ్రూలో శుభాకాంక్షలు తెలియజేయడాన్ని సూచిస్తుంది. దీని తరువాత వరునికి ఒక చిన్న కప్పులో వైన్ అందిస్తారు. ఇదేవిధంగా వధువు కూడా వైన్ తాగుతుంది. వారం రోజుల తర్వాత అతిథులు, బంధువులు కలిసి వధూవరులకు ఘనమైన విందు ఇస్తారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన సంప్రదాయ నృత్యం కూడా చేస్తారు.
ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో విషాదం
Comments
Please login to add a commentAdd a comment