వాషింగ్టన్: హమాస్ చెరలో బందీగా ఉన్న తమ దేశ పౌరుడు గాడి హగ్గాయ్ మరణించాడన్న వార్తతో తన గుండె పగిలిపోయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. హగ్గాయ్ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘హగ్గాయ్ గాజాలో హమాస్ చెరలోనే చనిపోయాడని తెలిసిన వెంటనే నా, నాభార్య జిల్ బైడెన్ హృదయాలు తీవ్ర విషాదంతో నిండిపోయాయి. హమాస్ వద్ద బందీగా ఉన్న హగ్గాయ్ భార్య క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాం’ అని జో బైడెన్ పేర్కొన్నారు. హగ్గాయ్ భార్య ఇప్పటికీ హమాస్ చెరలోనే బందీగా ఉందని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.
గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రూపు హగ్గాయ్ మరణాన్ని ధృవీకరించింది. అయితే ఆయన ఎందుకు చనిపోయాడన్న కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద గ్రూపు హమాస్ మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే.
బాంబు దాడులతో పాటు గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్‌లోని ప్రాంతం నుంచి కొంత మందిని హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి హమాస్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment