అమెరికా అగ్రరాజ్య హోదాను డొనాల్డ్ ట్రంప్ హయాంలో సొంతంగానే దాదాపుగా వదిలేసుకుంది. ఎవరి కోసమో మనం యుద్ధం చేయడమేమిటి? లక్షల కోట్ల డాలర్లను వెచ్చించడమేమిటి? వందల సంఖ్యలో అమెరికన్ సైనికులను బలిపెట్టడమేమిటి? మనకెందుకొచ్చిన పెత్తనం.. అనేది ట్రంప్ వాదన. అందుకే అఫ్గానిస్థాన్ నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలని తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొరకరాని కొయ్య లాంటి ఉత్తరకొరియాకు చెక్ పెడుతున్న దక్షిణ కొరియాకు అమెరికా సైన్యాన్ని పంపినందుకు డబ్బు చెల్లించమనే దాకా వచ్చారు.
‘పలువురి మేలు ఇంత మానుకొని.. సొంత లాభం కొంత చూసుకోవోయ్’ అనే ట్రంప్ మంత్రాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం అనుసరిస్తున్నారు. మరి ఉక్రెయిన్ సంక్షోభంలో ఇలాంటి అమెరికా మాట.. నాటో దేశాలు ఎందుకు గుడ్డిగా అనుసరిస్తున్నాయి? సొంత ప్రయోజనాలను వదులుకొని అమెరికా మాటను ఎందుకు పాటిస్తున్నాయి. వెర్రితనమా? అమాయకత్వమనుకోవాలా!
చదవండి: (Vladimir Putin: అదే పుతిన్ బలమా..?)
ఆంక్షలివీ.. కానీ అందరితో పాటే: అమెరికా
►వీఈబీ, సైనిక బ్యాంకు, వాటి 42 అనుబంధ సంస్థలపై నిషేధం
►ఐదుగురు రష్యా కుబేరుల బ్యాంకు ఖాతాల స్తంభన
►డాన్‌బాస్ ప్రాంతంతో అమెరికా పౌరులెవరూ ఆర్థిక లావాదేవీలు సాగించవద్దని ఆదేశం
►రష్యా బ్యాంకింగ్ రంగం, ప్రభుత్వ రంగ సంస్థల లావాదేవీలపై కొత్తగా ఆంక్షలు విధించాలని నిర్ణయం
►అయితే ఈ నిర్ణయాలన్నీ యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు అమలులోకి తెచ్చినపుడే తామూ పాటిస్తామని స్పష్టం చేసింది.
►2021లో రష్యాకు అమెరికా ఎగుమతులు 6,388 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇంత చిన్నమొత్తాన్ని వదులుకోవడానికి కూడా అమెరికా సిద్ధ పడటం లేదనేది ఇక్కడ గమనార్హం.
అమెరికా మాయలో పడి ‘లైఫ్‌లైన్’ పనులను ఆపేసిన జర్మనీ
రష్యా– జర్మనీని కలుపుతూ నిర్మాణంలో ఉన్న నార్డ్‌స్ట్రామ్–2’ గ్యాప్ పైప్‌లైన్ పనులను జర్మనీ తక్షణం నిలిపివేసింది. పైగా జర్మనీ దేశీయ గ్యాస్ వినియోగంలో రష్యా నుంచి వచ్చే గ్యాస్ వాటా ఏకంగా 65 శాతం ఉండటం గమనార్హం. మరి ఈ దేశాలు ఎందుకు ఎగిరెగిరి ఆంక్షలు పెడుతున్నాయో పైవాడికే తెలియాలి.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment