China Must Be Concerned About The Efficacy: ఉక్రెయిన్ పై రష్యా గత నెల రోజులకు పైగా సుదీర్ఘంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. రష్యా కైవ్‌ని స్వాధీనం చేసుకుని విజయ కేతనం ఎగురవేస్తుందోనని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెన్షన్‌గా ఎదురు చూస్తున్నాడు. పుతిన్ కల నెరవేర్చేలా రష్యా బలగాలు ఉక్రెయిన్ పై యుద్ధ వ్యూహాంతో, వివిధ ప్రణాళికలతో దూసుకుపోతున్నాయి.
ఒక రకంగా ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే క్రమంలో పుతిన్ ఆందోళ చెందుతుంటే మరోవైపు ఈ యుద్ధం ఎపట్టికీ ముగిస్తుందో తెలియక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన చెందుతున్నాడు. ఒక వేళ యుద్ధంలో రష్యా గెలిస్తే గనుక చైనా కమ్యూనిస్ట్ భావజాలానికి అనుకున్నట్లుగా పనిచేస్తుంది. ఒక వేళ యుద్ధంలో రష్యా ఓడిపోతే గనుక చైనా అగ్రరాజ్యం, పాశ్చాత్య దేశాల ఆగ్రహాన్ని ఎదుర్కొవల్సి ఉంటుంది.
చైనాను కలవర పెడుతున్న అంశాలు..
- చైనా ప్రపంచంలోనే అగ్రగామి వ్యాపారి. ఉక్రెయిన్‌లో సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన చైనా వాణిజ్యంపై ప్రభావం చూపింది.
- చైనా కూడా భారత్‌లా హైడ్రోకార్బన్ వంటి ఇంధనాల దిగుమతి కోసం వేరే దేశాల పై ఆధారపడుతోంది. అదీగాక ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థ పై మరింత తీవ్ర ప్రభావం చూపింది.
- నాటో వ్యూహాత్మక మద్దతుతో ఉక్రెయిన్ రష్యాతో చేస్తున్న పోరాటం తైవాన్ పై దాడికి దిగాలనుకున్న చైనా ఆలోచనను సందిగ్ధంలోకి నెట్టింది. ఒక వేళ చైనా తైవాన్‌తో యుద్ధానికి దిగినట్లయితే యూఎస్ దాని మిత్ర దేశాలు ఆ దాడిని తిప్పికొట్టేలా సైనిక సాయం చేస్తాయని చైనాకి పరోక్షంగానే అవగతమైంది.
- భారత్ వలే చైనా కూడా రష్యా నుంచే ఆయుధాలను కొనుగోలుచేస్తోంది. 2012లో ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ చైనా పగ్గాలు చేపట్టినప్పుడు, తన తోటి కమ్యూనిస్టులతో తన తొలి రహస్య ప్రసంగంలో సోవియట్ యూనియన్ పతనం, విచ్ఛిన్నం గురించి విశ్లేషించి, దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పడం గమనార్హం. ఈ ఏడాది బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో హద్దులు లేని స్నేహం చేస్తానని ప్రమాణం చేశారు. రష్యా ఓడిపోవడం కమ్యూనిస్ట్ నిరంకుశ పాలనలకు మంచిది కాదు.
- యుద్ధం జరుగుతున్న తీరు చూస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రోజురోజుకూ రాజకీయంగా బలహీనపడుతున్నట్లు తెలుస్తోంది. అదీగాక ఆర్థికపరంగా సైనిక మద్దతు కోసం చైనాపై మరింత ఆధారపడేలా చేస్తోంది. చైనాపై రష్యా ఆధారపడటం వలన భారత్‌కి భవిష్యత్తులో రష్యాతో గల సంబంధాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
- ఒక వేళ సీన్ రివర్స్ అయ్యి...ఉక్రెయిన్ గెలిచి ..మాస్కో పాలనలో మార్పు వచ్చి..పాశ్చాత్య అనుకూల నాయకుడు అధికారంలో వస్తే గనుక చైనా పై యూఎస్ దాని మిత్ర దేశాలు విరుచుకుపడతాయనడంలో సందేహం లేదు.
- ఏది ఏమైన చైనా, రష్యా నాయకులు ఇద్దరూ కూడా 2035 వరకు జీవితకాల నాయకులుగా కొనసాగనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment