వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. నెలరోజులకుపైగా జరుగుతున్న దాడుల కారణంగా ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు అగ్రరాజ్యం అమెరికా.. ఉక్రెయిన్‌కు సాయం అందించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి భారీ సాయాన్ని అందించేందుకు జో బైడెన్ ముందుకు వచ్చారు. బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్‌లో మాట్లాడిన జో బైడెన్.. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్‌కు తక్షణ సాయంగా మరో 500 మిలియన్ డాలర్లను సాయంగా అందించనున్నట్టు తెలిపారు.
మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చల్లో పురోగతి సాధించేందుకు.. కీవ్ సహా ఇతర ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు తగ్గించుకుంటామని చెప్పిన రష్యా మాట తప్పిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా సేనలు బాంబు దాడి చేశాయని వారు పేర్కొన్నారు. రష్యా ప్రకటనను చెర్నిహివ్ సిటీ కౌన్సిల్ సెక్రటరీ ఒలెగ్జాండర్ లోమాకో తప్పుపట్టారు. రష్యా పూర్తిగా అబద్దం ఆడుతోందని.. బాంబు దాడుల్లో ఏమాత్రం తగ్గడం లేదని తెలిపారు. ఐదు వారాలుగా జరుగుతున్న యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది చనిపోయారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. 40లక్షలకు పైగా ప్రజలు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లారని, అందులో సగం మంది చిన్నారులు ఉన్నారని.. ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.
White House provide details of Biden-Zelenskyy phone call
📞The United States will provide Ukraine with $ 500 million in direct budget assistance
📞The #US and partners will look for opportunities to increase assistance to #Ukraine
1/2https://t.co/kHBAZtzi6g— NEXTA (@nexta_tv) March 30, 2022
ఇక, తాజాగా ఉక్రెయిన్‌లో చోటుచేసుకున్న ఓ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని లిబిరేటెడ్ గ్రామాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైన్యం వచ్చి అక్కడున్న వారిని రక్షించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ గ్రామంలోకి ఉక్రెయిన్ సైనికులు రావడంతో ఓ వృద్దురాలు దేవుడి థ్యాంక్స్ అంటూ అభివాదం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A touching video from a liberated village. An elderly woman thanks God for the fact that Ukrainian Armed Forces entered the town. pic.twitter.com/6ECf7TfNyB— NEXTA (@nexta_tv) March 30, 2022
Comments
Please login to add a commentAdd a comment