వాషింగ్టన్: యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన యుద్ధం ముగింపుకు జరుగుతున్న ప్రయత్నాలకు కృషి జరిగితే సహాయకరంగా ఉంటుందని తెలిపింది. ఈ శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీచేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది.
ప్రధాని ఉక్రెయిన్ పర్యటనను అమెరికా ముఖ్యమైన పర్యటనగా పేర్కొంది. ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపింది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్ సంఘర్షణకు ముగింపు పలికినట్లయితే.. అది బాగా ఉపయోకరంగా ఉంటుందని భావిస్తున్నామని తెలిపింది.
ఇక శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతీ ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
ఇక సమయం వృథా చేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలని.. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్‌లకు పిలుపునిచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా, శాంతివైపు ఉందని మోదీ చెప్పారు. వాణిజ్యం, రక్షణ, ఆరోగ్యసేవలు, ఔషధాలు, వ్యవసాయం, విద్య వంటి రంగాల గురించి అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment