Very Happy Old Man Looking Forward To A Wonderful Future - Greta Thunberg - Sakshi
Sakshi News home page

 ట్రంప్‌కు దిమ్మదిరిగే పంచ్‌!

Published Thu, Jan 21 2021 10:45 AM | Last Updated on Thu, Jan 21 2021 4:46 PM

 Very Happy Old Man Greta Thunberg punch to  Donald Trump - Sakshi

వాషింగ్టన్‌:  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌కు  మరోసారి స్వీడిష్‌ యువ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్‌  దిమ్మదిరిగే షాక్‌  ఇచ్చింది.  గతంలో ఒకసారి చిల్‌ ట్రంప్ చిల్‌ ‌ అంటూ ట్రంప్‌పై కౌంటర్‌ ఎటాక్‌ చేసిన గ్రెటా తాజాగా మరోసారి సోషల్‌ మీడియా ద్వారా  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  (‘‘చిల్ డొనాల్డ్‌ చిల్‌’’ ట్రంప్‌కు గట్టి కౌంటర్‌)

లాస్ట్‌ పంచ్‌ నాదైయితే ఆ కిక్కే వేరప్పా అన్నట్టుగా లాస్ట్‌ పంచ్‌తో అదరగొట్టేశారు గ్రెటా. ట్రంప్‌పై తన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ఆయనపదవీ విరమణ సమయాన్ని కరెక్టుగా వాడుకున్నారు. గ్రెటా‌ ట్వీట్‌ను పరిశీలించినవారు ఎవరైనా ఇదే ఫీల్‌ అవుతారు. తన ట్వీట్‌లో గ్రెటా ఏమన్నారంటే.. 'ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న సంతోషవంతమైన వృద్దుడిలా ట్రంప్‌ కనిపిస్తున్నారు. ఇలా చూడటం చాలా బాగుంది.' అంటూ గ్రెటా థన్ బర్గ్ ట్వీట్‌ చేశారు. దీనికి ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడుతున్న ఫోటోను షేర్ చేయడం విశేషం

కాగా గత ఏడాది సెప్టెంబరులో  ఐక్యరాజ్య సమితి వేదికపై  ప్రసంగించిన గ్రెట్‌ ప్రపంచ పర్యావరణ అంశాన్ని ప్రపంచాధినేతలు నిర్లక్క్ష్యం  చేస్తున్నారని  నిర‍్భయంగా వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే మీ బిడ్డలకు భవిష్యత్తు ఉండదంటూ అగ్రనేతలకు ఆమె  చురకలంటించారు. అయితే దీనిపై స్పందించిన అప్పటి యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ 'ఆమె ఉజ్వలమైన, అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న చాలా సంతోషవంతమైన యువతిలా ఉంది. చూడటానికి చాలా బాగుంది.' అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాదు 'టైమ్‌' మేగజీన్ 2019 సంవత్సరానికి గాను 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా గ్రెటా పేరును ప్రకటించినప్పుడు చిల్ గ్రెటా చిల్!' అంటూ  ట్రంప్‌ ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా చిల్‌ చిల్‌ డొనాల్డ్‌ అంటూ గట్టి చురకలే అంటించిన సంగతి తెలిసిందే.  కానీ తాజా పరిణామంలో ఆసక్తికర విషయం ఏమిటంటే ట్విటర్‌ ట్రంప్‌ను శాశ్వతంగా ఇప్పటికే నిషేధించింది.. సో.. లాస్ట్‌ పంచ్‌ కిక్‌  గ్రెటాదే కదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement