ప్రతి కుటుంబానికీ కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డు అందించండి | Sakshi
Sakshi News home page

ప్రతి కుటుంబానికీ కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డు అందించండి

Published Tue, May 7 2024 1:00 AM

ప్రతి కుటుంబానికీ కాంగ్రెస్‌ గ్యారంటీ కార్డు అందించండి

● నిజామాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌: ప్రతి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డులను ఓటరుకు అందించాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి టి. జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం బీర్‌పూర్‌ మండలం తుంగూర్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పిప్పల్ల గంగరాజం తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేసే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేశ్‌, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్‌, ఎంపీటీసీ ఆడెపు మల్లీశ్వరి, నాయకులు ఆడెపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement