జిల్లాకు కొత్త ఉపాధ్యాయులు
● సీఎం చేతులమీదుగా నియామక పత్రాలు ● దసరా తర్వాత విధుల్లోకి ● జిల్లాలో మెరుగుపడనున్న విద్య
ఎంపికై న అభ్యర్థులు 282
స్కూల్ అసిస్టెంట్లు 101
ఎస్జీటీలు 143
భాషా పండితులు 31
పీఈటీలు 7
జగిత్యాల: జిల్లాకు కొత్త ఉపాధ్యాయులు వస్తున్నారు. దసరా పండగ అనంతరం విధుల్లో చేరనున్నారు. డీఎస్సీలో అర్హత సాధించిన వారిని 1ః3 నిష్పత్తిలో ఎంపిక చేసి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా విద్యాశాఖ అధికారులు నియామక పత్రాలు అందించారు. జిల్లా నుంచి వెళ్లిన అభ్యర్థులకు విద్యాశాఖ ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేసింది. జిల్లాకు మొత్తం 282 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఒక కేటగిరీకి సంబంధించి కోర్టు కేసు ఉండటంతో ప్రక్రియ ఆగిపోయింది. జిల్లాలో ఇటీవల ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీల్లో కొత్తగా నియమితులైన 282 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు.
మెరుగుపడనున్న విద్య వ్యవస్థ
ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఇటీవల విద్యాశాఖ పీజీహెచ్‌ఎంలను మండల విద్యాధికారులుగా నియమించింది. దీంతో ప్రభుత్వ విద్య బలోపేతం అయినా ఉపాధ్యాయుల ఖాళీలు వేధించాయి. ప్రస్తుతం 282 మంది ఉపాధ్యాయులు రానుండటంతో ఆ సమస్య కూడా మెరుగుపడనుంది. నియామక పత్రాలు అందుకున్నవారికి జేసీ రాంబాబు, డీఈవో జగన్మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది
జిల్లాకు 282 మంది ఉపాధ్యాయులను వివిధ కేటగిరీల్లో ఎంపిక చేశాం. కొత్త ఉపాధ్యాయుల రాకతో విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది. సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకునేందుకు అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశాం. దసరా తర్వాత వారంతా విధుల్లో చేరనున్నారు.
– జగన్మోహన్‌రెడ్డి, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment